సీనియర్ హీరోయిన్ ట్రాప్ లో కుర్ర హీరో.. ఏమవుతుందో..?

By Udayavani DhuliFirst Published Jan 6, 2019, 10:39 AM IST
Highlights

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఓ సీనియర్ హీరోయిన్ దాదాపు హీరోలదరి సరసన జత కట్టింది. ఇండస్ట్రీలో కొత్త నీరు రావడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయానని అనుకుంటున్న సమయంలో మళ్లీ పుంజుకుంది. 

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఓ సీనియర్ హీరోయిన్ దాదాపు హీరోలదరి సరసన జత కట్టింది. ఇండస్ట్రీలో కొత్త నీరు రావడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయానని అనుకుంటున్న సమయంలో మళ్లీ పుంజుకుంది. వరుసగా సినిమాలు సైన్ చేస్తూ బిజీ అయిపోయింది. 

రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ కుర్ర హీరోతో కలిసి నటించింది. బాక్సాఫీస్ వద్ద సినిమా వర్కవుట్ కానప్పటికీ వీరిద్దరి మధ్య బాండింగ్ మాత్రం బాగా వర్కవుట్ అయిందని సమాచారం. షూటింగ్ సమయంలో ఈ యంగ్ హీరో ఆమె చుట్టూనే తిరిగేవాడట. ఆమె షాపింగ్ ఇతర ఖర్చులన్నీ అతడే భరించేవాడట.

ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆమె కోసం హీరో బాగా కర్చు చేస్తున్నట్లు టాక్. ఇద్దరిలో ఎవరి పుట్టినరోజు వచ్చినా.. పార్టీ ఇచ్చేది, గిఫ్ట్ లు ఇచ్చేది హీరోగారే అట. హైదరాబాద్ లో ఈ హీరోయిన్ ఉన్నన్ని రోజులు కూడా ఈ హీరోగారే ఆమె అవసరాలన్నీ చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం సదరు హీరో తండ్రికి తెలియడంతో.. ఓ అమ్మాయి కోసం ఇంతగా ఖర్చుపెడతావా అంటూ క్లాస్ తీసుకున్నారట. అయినా ఈ హీరో మాత్రం మారడం లేదని సమాచారం. మరి ఈ విషయం ఇంకెక్కడి వరకు వెళ్తుందో చూడాలి! 

click me!