
అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి పేరు మారుమోగుతోంది. అఖండ చిత్రంలో బాలయ్యని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాడు. ఫలితంగా వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ విజయం నమోదైంది. దీనితో బోయపాటి తదుపరి చిత్రం ఏంటనే చర్చ ఫిలిం నగర్ లో జోరుగా సాగుతోంది. వాస్తవానికి అఖండ తర్వాత బన్నీతో మూవీ చేయాలని బోయపాటి ప్లాన్ చేసుకున్నారు.
కానీ పుష్ప పార్ట్ 2 పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. దీనితో బోయపాటి శ్రీను ఈ గ్యాప్ లో ఓ సినిమా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీనితో ఎనెర్జిటిక్ స్టార్ రామ్ తో బోయపాటి నెక్స్ట్ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఓ మాస్ కథాంశంతో బోయపాటి రామ్ హీరోగా సినిమా చేయబోతున్నాడు.
తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో బోయపాటి రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. అఖండ చిత్రంతో బోయపాటి బాలయ్యకు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందించాడు. దీనితో బోయపాటి రామ్ చిత్రానికి భారీ పారితోషికం అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం హీరో రామ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ బోయపాటి అందుకోబోతున్నారట. రామ్ ఈ చిత్రానికి 9 కోట్ల పారితోషికం తీసుకొబోతుంటే.. బోయపాటి 12 కోట్ల వరకు తీసుకుంటున్నాడట.
కెరీర్ ఆరంభంలో తాను నిర్మాతలని అసలు రెమ్యునరేషన్ అడగలేదని.. వారు తన ఖర్చులకు మాత్రమే డబ్బు ఇచ్చేవారని బోయపాటి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కొన్ని హిట్స్ అందుకున్న తర్వాత పారితోషికం తీసుకోవడం మొదలు పెట్టినట్లు బోయపాటి పేర్కొన్నారు. బోయపాటి తెరకెక్కించిన తొలి చిత్రం భద్ర. ఆ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే.