Mahesh babu:'పోకిరి'తో ఇండస్ట్రీ హిట్ తర్వాత వరుసగా మూడు ప్లాప్స్.. మూడేళ్లు గ్యాప్.. అప్పుడు మహేష్ కి ఏమైంది?

Published : Feb 06, 2022, 03:49 PM IST
Mahesh babu:'పోకిరి'తో ఇండస్ట్రీ హిట్ తర్వాత వరుసగా మూడు ప్లాప్స్.. మూడేళ్లు గ్యాప్.. అప్పుడు మహేష్ కి ఏమైంది?

సారాంశం

పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మహేష్ కి వరస్ట్ పీరియడ్ నడిచింది.ఆయన మూడేళ్లు వెండితెరకు దూరం అయ్యారు. దానికి కారణం ఏమిటో మహేష్ తెలియజేశారు.  

బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు (Mahesh babu)పరిశ్రమలో పుట్టి పెరిగాడు. అయినప్పటికీ చాలా సెన్సిటివ్. ఎక్కువగా మాట్లాడలేడు. అందరితో కలిసిపోలేడు. రిజర్వ్డ్ గా ఉండే ఇంట్రావర్ట్ అని చెప్పొచ్చు. సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మహేష్ బాబుని ప్లాప్ ఫోబియా వదల్లేదు. మహేష్ తన మూవీ ప్లాప్ అయితే మూడు రోజులు ఇంటిలో నుండి బయటికి రాడట. ఈ విషయాన్ని ఆయన ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో చెప్పారు. 

ఈ షో ఫస్ట్ సీజన్ చివరి గెస్ట్ గా వచ్చిన మహేష్ పలు వ్యక్తిగత విషయాల పై స్పందించారు. నమ్రతతో వివాహం గురించి బాలయ్య (Balakrshna)అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఇక మహేష్ ఫ్యాన్స్ ని ఎప్పటి నుండో వేధిస్తున్న ఓ ప్రశ్నకు ఈ షో వేదికగా సమాధానం దొరికింది. మహేష్ తన కెరీర్ లో మూడేళ్లు మేకప్ వేసుకోలేదు. ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ ఆ పీరియడ్ మొత్తం చాలా వర్రీ అయ్యారు. 

మూడేళ్లు గ్యాప్ రావడానికి కారణాలు మహేష్ వివరించారు. పోకిరి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ మూవీ తర్వాత ఎలాంటి సబ్జెక్టు ఎంచుకోవాలో తెలియదు. అదే సమయంలో ఎంతగానో ఇష్టపడే మా అమ్మమ్మ చనిపోయారు. నెలల వ్యవధిలో నమ్రత తల్లిదండ్రులు చనిపోయారు. ఆ పీరియడ్ చాలా కష్టంగా గడిచింది. అదే సమయంలో నన్ను నేను మార్చుకోవడానికి దోహదం చేసింది. మానసికంగా సినిమాలకు సిద్ధంగా లేని నేను ఒక ఏడాది గ్యాప్ తీసుకుందామనుకున్నా... అనుకోకుండా అది మూడేళ్ల పాటు సాగింది.. అంటూ మహేష్ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. 

అమ్మమ్మ అత్త మామల మరణాలు, వరుస ప్లాప్స్ మహేష్ ని మానసికంగా కృంగదీశాయి. దీంతో మహేష్ విరామం తీసుకున్నాడు. 2006లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోరికి ఇండస్ట్రీ హిట్ అందుకుంది. మహేష్ ఇమేజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రమది. అయితే పోకిరి విజయంతో వచ్చిన ఆనందం మెల్లగా ఆవిరైపోయింది. అదే ఏడాది గుణశేఖర్ డైరెక్షన్ లో చేసిన సైనికుడు , 2007లో విడుదలైన అతిథి ప్లాప్ ఖాతాలో చేరాయి. 

పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా మహేష్ కి గడ్డుకాలం నడిచింది. అదే మహేష్ సినిమాల నుండి మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమైంది. 2010లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఖలేజా సైతం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. 2011లో మహేష్ కమ్ బ్యాక్ అయ్యారు దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన దూకుడు చిత్రం భారీ హిట్ కొట్టింది. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తర్వాత వచ్చిన బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వరుసగా విజయం సాధించాయి. 
 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం