Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్ ... కరోనా నుండి కోలుకున్న చిరు, వెంటనే షూటింగ్ షురూ!

Published : Feb 06, 2022, 03:00 PM IST
Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్ ... కరోనా నుండి కోలుకున్న చిరు, వెంటనే షూటింగ్ షురూ!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కరోనా నుండి కోలుకున్నారు. ఆయన తిరిగి సెట్స్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన తెలియజేశారు.

చిరు రెండవ పర్యాయం కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన ఇంటిలోనే ఐసొలేట్ అయ్యారు. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. చిరంజీవి వరుసగా చిత్రాలు ప్రకటించిన విషయం తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య (Acharya)సమ్మర్ కానుకగా విడుదల కానుంది . దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ మూవీ పలుమార్లు వాయిదా పడింది. ఫిబ్రవరి 4 నుండి ఏప్రిల్ 1కి షిఫ్ట్ అయిన ఆచార్య... మరలా ఏప్రిల్ 29న ఫైనల్ విడుదల తేదీగా ప్రకటించారు. 

అలాగే దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ సెట్స్ పైన ఉంది. ఇది తమిళ చిత్రం వేదాళం రీమేక్ అని సమాచారం. ఈ చిత్రం కంటే ముందు మలయాళ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతుంది. అలాగే దర్శకుడు బాబీతో ఒక మూవీ ప్రకటించారు చిరంజీవి. 

చిరంజీవికి కరోనా రావడంతో ఈ ప్రాజెక్ట్స్ షూటింగ్ వాయిదా పడ్డాయి. తన వలన ఏర్పడిన అసౌకర్యాన్ని గుర్తించి చిరంజీవి కోలుకున్న వెంటనే సెట్స్ కి వెళ్లారు. గాడ్ ఫాదర్ షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయిన చిరంజీవి దానికి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. కరోనా నుండి కోలుకున్నట్లుగా చిరంజీవి ఈ సందర్భంగా వివరించారు. 

ఇక చిరంజీవి షేర్ చేసిన ఫోటోలలో నటుడు సునీల్, బ్రహ్మాజీ, సత్య దేవ్ తో పాటు దర్శకులు మోహన్ రాజా, మెహర్ రమేష్ కూడా ఉన్నారు. ఇక ఏదో పెళ్లి వేడుకకు సంబంధించిన షూట్ జరుగుతున్నట్లు సదరు ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. ఇక ఈ నాలుగు చిత్రాలతో పాటు ఛలో ఫేమ్ వెంకీ కుడుములతో ఓ మూవీ ప్రకటించారు చిరంజీవి. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ చిరు... సత్తా చాటుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం