
అందం, అభినయంతో కోట్లాది మంది హుదయాల్లో నిలిచిపోయింది ఇండియాన్ గ్రేట్ యాక్ట్రస్ శ్రీదేవి. అభిమానులను సంపాదించుకొని.. అందరి మనసులను కొల్లగోట్టింది. అయితే తన ఫ్యామితో పాటు.. కోట్లాది అభిమానులను అనాధలను చేస్తూ.. అలనాటి అందాల తార శ్రీదేవి . దుబాయ్‌లో ఎవరూ ఊహించని స్థితిలో ఆకస్మిక మరణం చెందింది. భర్త బోనీకపూర్ ,కూతుళ్లు జాన్వీకపూర్,ఖుషీ కపూర్ తో పాటు శ్రీదేవి ఫ్యాన్స్ ఆమె మరణాన్నితట్టుకోలేకపోయారు. శ్రీదేవి మరణాన్ని కొంత లో కొంత మర్చిపోవడానికి.. ఆమె ముద్దుల తనయ జాన్వీకపూర్‌ను శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
అయితే శ్రీదేవి సడెన్ గా మరణించడంతో.. ఆమె చివరి కోరక అలాగే ఉండిపోయిందట. తను కలలు కన్న ఓ ప్రాజెక్ట్ ను రీసెంట్ గా ఆమె భర్త బోణీ కపూర్ నేరవేర్చారట. శ్రీదేవి 80లో కెరీర్ లో మంచి ఊపు మీద ఉన్నప్పుడు చెన్నైలో.. ఓ ప్లేస్ కొన్నదట. ఆమె జోష్‌మీదున్న టైమ్ లో చెన్నైకి సమీపంలోని మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో బీచ్ దగ్గర ఐదెరకాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అయితే బీచ్ పేస్‌లో డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి అని... ఎంతో ఆశపడిందట. అయితే ఆ కోరిక తీరకుండానే అందరినీ విడిచిపోయింది.
అయితే తన సతీమణి చిరకాల చివరి కోరికను ఆమె భర్త, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ తాజాగా నెరవేర్చారు.శ్రీదేవి చనిపోయిన ఐదేళ్ల తర్వాత తాజ్ గ్రూప్ పార్ట్‌నర్‌షిప్‌లో హోటల్‌గా అభివృద్ధి చేశారు. దీని గురించి బోనీకపూర్ మాట్లాడుతూ.. ఇది శ్రీదేవి కల. శ్రీదేవి డ్రీమ్‌ను నెరవేర్చేందుకు రెండేళ్లుగా డెవలప్‌మెంట్ పనులు చేపట్టి.. ఫైనల్‌గా బీచ్ హౌస్‌ను పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. శ్రీదేవి డ్రీమ్ హౌస్ లొకేషన్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇక తన తల్లి ముందుగా హీరోయిన్ గా ఎదిగిన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది జాన్వీ కపూర్. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ జోడీగా.. దేవర సినిమాలో నటిస్తోంది జాన్వీ. ఈమూవీ నుంచి రీసెంట్ గా జాన్వీ కపూర్ పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా తరువాత తమిళంలో కూడా సినిమా చేయబోతుందంట జాన్వీ.