9 ఏళ్ల తర్వాత అఖిలేష్ యాదవ్ ని కలిసిన రజనీకాంత్.. అయోధ్యకి పయనమైన తలైవా

By Asianet NewsFirst Published Aug 20, 2023, 3:43 PM IST
Highlights

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా కాలం తర్వాత తలైవా ఫుల్ స్టామినా చూపించిన చిత్రం జైలర్. జైలర్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా కాలం తర్వాత తలైవా ఫుల్ స్టామినా చూపించిన చిత్రం జైలర్. జైలర్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. దీనితో రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 10న విడుదలై సంచలన విజయం సాధించింది. 

జైలర్ ఇంత హంగామా సృష్టిస్తున్నప్పటికీ రజనీకాంత్ మాత్రం సైలెంట్ గా నార్త్ ఇండియా పర్యటనకి వెళ్లారు. కొన్ని రోజులు హిమాలయాల్లో గడిపిన రజనీకాంత్ ప్రస్తుతం వివిధ రాజకీయ నేతలతో సమావేశం అవుతున్నారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో రజనీకాంత్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే రజనీకాంత్ యోగి ఆదిత్యనాథ్ కాళ్ళకి నమస్కరించడం వివాదంగా మారింది. 

ఇది పక్కన పెడితే రజనీకాంత్ మరో ముఖ్యనేతని కలిశారు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ని రజనీకాంత్ కలిశారు. భేటీ అనంతరం రజనీ మీడియాతో మాట్లాడారు. 9 ఏళ్ల నుంచి అఖిలేష్ నాకు మిత్రుడు. 9 ఏళ్ల క్రితం ముంబైలో ఓ ఫంక్షన్ లో మీట్ అయ్యాం. ఆ తర్వాత కలుసుకునే అవకాశం రాలేదు. 

ఇప్పుడు అఖిలేష్ ని కలవడం సంతోషంగా ఉంది అని అన్నారు. లక్నోలో అఖిలేష్ నివాసంలో వీరిద్దరి భేటీ జరిగింది. కాసేపు ముచ్చటించుకున్న తర్వాత రజనీ తిరిగి వెళ్లారు. దివంగత నేత, అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ చిత్ర పటానికి రజనీ నివాళులు అర్పించారు. 

మీడియాతో మాట్లాడుతూ తాను అయోధ్యని సందర్శించనుండడంపై తలైవా ఓపెన్ అయ్యారు. శ్రీరాముడి ఆశీర్వాదం కోసం తాను నేడు అయోధ్యకి వెళ్లనున్నట్లు తలైవా తెలిపారు. అఖిలేష్ యాదవ్ తో రజనీ భేటీ అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ ఇలా ఎప్పుడూ లేనంతగా రాజకీయ నేతలని భేటీ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాయావతిని కూడా కలుస్తారా అని ప్రశ్నించగా లేదు కలవడం లేదు అని రజనీ క్లారిటీ ఇచ్చారు. 

click me!