విజయ్ దేవరకొండ - సమంత జంటగా ‘ఖుషి’ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ నటీనటులు, డైరెక్టర్ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గ్గా మారింది. ఎవరెవరు ఎంత తీసుకున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది.
డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - , స్టార్ హీరోయిన్ సమంత (Samantha) హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘ఖుషి’ (Kushi). చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ గ్రాండ్ గా నిర్మించారు. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చిత్రానికి హేషమ్ అబ్దుల్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్ర ప్రచార కార్యక్రమాలను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ‘ఖుషి’ నటీనటులు, డైరెక్టర్ తీసుకున్న పారితోషికంపై ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఎవరెవరు ఎంత చార్జీ చేశారనే అంశం హాట్ టాపిక్ అయ్యింది. అయితే, వీరిలో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్మాణ (Shiva Nirvana) భారీ మొత్తంలో తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రటకన లేదు. కానీ టాక్ గట్టిగా వినిపిస్తోంది. చిత్రం కోసం విజయ్ దేవరకొండ రూ.23 కోట్లు, సమంత రూ.4.5 కోట్లు. డైరెక్టర్ శివ నిర్వాణ ూ.12 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.
undefined
మరోవైపు జయరామ్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, అలీ, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి స్టార్ నటులు రూ.20 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు పారితోషికాలు అందుకున్నారని అంటున్నారు. కానీ, విజయ్, శివ నిర్వాణ రెమ్యునరేషన్ పై నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వరుస ఫ్లాప్స్ ను అందుకుంటున్న విజయ్ మొన్నటి వరకు సినిమాకు రూ.10 కోట్లు తీసుకున్నారని, ఈ చిత్రానికి అంత మొత్తం తీసుకునే ఛాన్స్ లేదని అంటున్నారు. మరోవైపు శివ నిర్వాణ కూడా గత చిత్రం ‘టక్ జగదీష్’ ఫ్లాప్ నే ఇవ్వడంతో ఆయనా అంత పారితోషికం అందుకున్నారంటే నమ్మశక్యంగా లేదంటున్నారు.
కానీ ‘ఖుషి’ చిత్రంతో విజయ్, సామ్, శివ నిర్వాణకు సాలిడ్ హిట్ అందనుందని పలువురు అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి అందుతున్న ప్రమోషనల్ మెటీరియల్ కు మాసీవ్ రెస్పాన్స్ దక్కుతున్న విషయం తెలిసిందే. టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు విశేష ఆదరణ దక్కింది. దీంతో ఫ్యాన్స్, మూవీ లవర్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ కూడా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం మరో పదిరోజుల్లో థియేటర్లోకి రానుంది.