
పఠాన్ సినిమాతో బాలీవుడ్ కు ఊపిరిపోశాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఈమూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. పఠాన్ సృష్టించిన ప్రభంజనాన్ని జవాన్ తో కంటీన్య్యూ చేయాలి అనే ఆలోచనలో ఉన్నాడు షారుఖ్. అందుకే జవాన్ సినిమా విషయంలో.. ఆచి తూచి వ్వవహరిస్తున్నాడు. తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీకుమార్ రూపొందిస్తున్న ఈసినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
ఈషినిమాతో బాద్ షా జంటగా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. దాంతో ఈసినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎంతో ఆశగా ఈసినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులను కాస్ తనిరాశపరిచి సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసి.. మరో కొత్త డేట్ ను రిలీజ్ చేశారు. ముందుగా జూన్ 2న రిలీజ్ కావల్సిన జవాన్ మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. కాని రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వలేదు.
ఇక తాజాగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ న్యూస్ విని షారుఖ్ ప్యాన్స్ షాక్ కు గురయ్యారు. జూన్ లో సందడి చేస్తారు అనుకుంటే.. సెప్టెంబర్ వరకూ వెళ్ళడంతో.. షారుఖ్ ఫ్యాన్స్ ఆశలు అడియాశలు అయ్యాయి. కెరియర్ లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలిచేలా అట్లీకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
ఇక భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కిన ఈసినిమా.. షూటింగ్ పూర్తయ్యింది కాని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా ఎక్కువ టైమ్ కావల్సి ఉంది. అందుకే మూవీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. ఎక్కువ సమయం పడుతోంది. అందుకే సినిమా విడుదలను వాయిదా వేసినట్లు చిత్ర బృందం సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతే కాదు. షారుఖ్ చేసిన ఫీట్లకు తగ్గ మ్యూజిక్ ఆడ్ చేయడానికి చాలా టైమ్ పడుతుందట. అంతే కాదు ఆదిపురుష్ రిలీజ్ ను దృష్టిలో పెట్టుకుని జవాన్ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసిన్టు సమాచారం.