సమంత - విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా బ్యూటీఫుల్ ప్రోమోను వదిలారు. సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - సమంత (Samantha) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యెర్నెని, రవి శంకర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఇప్పటికే వదిలిన పోస్టర్లతో హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నారు.
Kushi నుంచి మొదటి పాటను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తొలిపాట ‘నా రోజా నువ్వే’ Na Rojaa Nuvve అనే టైటిల్ తో రానుందని తెలిపారు. మే 9న సాంగ్ రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ అదేరోజు విడుదల చేయబోతున్నారు. అయితే తాజాగా ప్రోమోను వదలడంతో యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.
‘హృదయం’ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఫేమ్ దక్కించుకున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ ‘ఖుషి’కి బ్యూటీఫుల్ ట్రాక్స్ ను అందిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా విడుదలైన సోల్ ఫుల్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. దీంతో ఫస్ట్ సింగిల్ పై మరింతగా ఆసక్తి పెరిగింది. ఫస్ట్ ట్రాక్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత అభిమానులు ‘ఖుషి’ కోసమే ఎదురుచూస్తున్నారు. చివరి చిత్రాలతో ఇద్దరూ డిజాస్టర్ రిజల్డ్ నే దక్కించుకున్నారు. దీనితో ఈ చిత్రంతో హిట్ కొట్టేలా కనిపిస్తోంది. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది. ఈక్రమంలో ఇప్పటి నుంచి అంచనాలను పెంచేలా అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు.
Here's the lovely glimpse of First Single ❤️
- https://t.co/NaKjbF310N
Full song out on May 9th 🎧❤️🔥 pic.twitter.com/XDWXepNYvd