విషాదం.. బాలీవుడ్ సీనియర్ నటుడు హరీష్ మాగోన్ కన్నుమూత

Published : Jul 02, 2023, 08:34 PM ISTUpdated : Jul 02, 2023, 08:35 PM IST
విషాదం.. బాలీవుడ్ సీనియర్ నటుడు హరీష్ మాగోన్ కన్నుమూత

సారాంశం

అన్ని చిత్ర పరిశ్రమలలో విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు హరీష్ మాగోన్ (76) తుదిశ్వాస విడిచారు. జూన్ 1 రాత్రి సమయంలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అన్ని చిత్ర పరిశ్రమలలో విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు హరీష్ మాగోన్ (76) తుదిశ్వాస విడిచారు. జూన్ 1 రాత్రి సమయంలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే హరీష్ మృతికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. 

వృద్ధాప్యం, అనారోగ్యం వల్లే మరణించారని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. బాలీవుడ్ సినిమా అండ్ టివి అసోసియేషన్ ఆయన మరణాన్ని తెలియజేస్తూ, సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. హరీష్ మాగోన్ 1946 డిసెంబర్ 6న బాంబే ప్రెసిడెన్సీ లో జన్మించారు. 1974లో పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి గ్రాడ్యుయేషన్ పొందారు. 

హరీష్ మాగోన్ కి భార్య, కొడుకు సిద్దార్థ్, కుమార్తె ఆరుషి ఉన్నారు. ఆరుషి సింగపూర్ లో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఆయన ఫిలిం జర్నీ విషయానికి వస్తే గోల్ మాల్, నమక్ హలాల్, ఇంకార్ , చుప్కె చుప్కె , ఖుష్బూ, సెహన్షా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హరీష్ మాగోన్ భాగమయ్యారు. 

ముంబైలో హరీష్ తన పేరుపై యాక్టింగ్ స్కూల్ ని కూడా రన్ చేశారు. హరీష్ మృతితో బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. ఆయన చిత్రాలని గుర్తు చేసుకుంటున్నారు. హరీష్ మాగోన్ చివరగా నటించిన చిత్రం ఉఫ్ ఏ మహాబాత్ 1997లో విడుదలయింది. అప్పటి నుంచి ఆయన నటనకి దూరం అయ్యారు. 

హరీష్ మృతి పట్ల ఆయన విద్యార్థులు కూడా శోకంలో మునిగిపోయారు. హరీష్ చిత్రాలలో దృశ్యాలని షేర్ చేస్తూ సంతాపం తెలుపుతున్నారు. ఈ అద్భుతమైన నటుడికి బాలీవుడ్ దక్కాల్సిన గుర్తింపు దక్కలేదనేది చాలా మంది అభిప్రాయం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..