నటుడు చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. ఈరోజు ట్రైలర్ విడుదలైంది. విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. పల్లెటూరిలో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
30 Weds 21 సిరీస్ తో అలరించిన చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ (Annapurna Photo Studio). ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రానికి మంచి హైప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. పాటలు, టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని పెంచేశారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ అయ్యింది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. తన రివ్యూ ఇచ్చి టీమ్ ను అభినందించాడు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెలుస్తోంది. 90వ దశకంలోని కథగా అన్నపూర్ణ ఫొటో స్టూడియోను తెరకెక్కించారు. ఓ ప్రేమికుడు తను ప్రేమించి అమ్మాయి కోసం ఎన్ని పాట్లు పడ్డాడు.. ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనేదే ఈ చిత్రం ప్రధాన కథాంశంగా తెలుస్తోంది. నేతితరానికి కనెక్ట్ అయ్యేలా ట్రైలర్ ను చూస్తూ అనిపిస్తోంది. బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ డ్రామా ఇలా అన్నీ ఉన్నాయి. ఇక 80, 90ల నేపథ్యాన్ని ఎంచుకోవడంతో ఓ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. నాటి వాతావరణాన్ని చక్కగా క్రియేట్ చేశారు. ఇక పాటలు, నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ ఇలా అన్నీ కూడా ట్రైలర్‌లో అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్‌ను ఇప్పుడే లాంచ్ చేశాను. రంగమ్మ అనే పాట రెట్రో ఫీలింగ్‌ను ఇచ్చింది. టీజర్ కూడా బాగా నచ్చింది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. జూలై 21న ఈ సినిమా థియేటర్లో వస్తోంది. అందరూ తప్పక చూడండి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. బిగ్ బెన్ స్టూడియోస్ నా కెరీర్‌లో ఎంతో ఇంపార్టెంట్. బిగ్ బెన్ స్టూడియోస్ వల్లే పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయింది. యశ్ మామకు ఆల్ ది బెస్ట్' అని అన్నారు.
యశ్ రంగినేని మాట్లాడుతూ.. 'విజయ్ ఎప్పుడూ కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నారు. అన్నపూర్ణ ఫోటో స్టూడియోస్‌ను సపోర్ట్ చేసినందుకు థాంక్స్. రెట్రో ఫీలింగ్‌ను తీసుకు రావాలనే ఇలాంటి బ్యాక్ డ్రాప్‌ను ఎంచుకున్నామన్నారు. దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. 'ట్రైలర్‌ను రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండకు థాంక్స్. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, ఫన్‌గా నడుస్తుంది. సెకండ్ హాఫ్‌లో ట్విస్టులుంటాయి. సంక్రాంతి హాలీడేలకు ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. పాటలు బాగా వచ్చాయి. ఈ జూలై 21న సినిమా విడుదల కాబోతోంన్నారు. ఇక హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ.. 'విజయ్ దేవరకొండ మాలాంటి వాళ్లకు స్పూర్తి. నా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన విజయ్‌కు థాంక్స్. అని చెప్పారు. హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.. 'ట్రైలర్‌ను లాంచ్ చేసినందుకు విజయ్ దేవరకొండ కు థాంక్స్. ఇప్పటికే పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానని అభిప్రాయపడ్డారు.
చిత్రంలో చైతన్య రావ్, లావణ్య జంటగా నటించారు. మిగిలిన పాత్రల్లో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య నటించారు. ఈ చిత్రానికి సంగీతం - ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ - పంకజ్ తొట్టాడ, ఎడిటర్ - డి వెంకట్ ప్రభు, పీఆర్వో - జీఎస్కే మీడియా వ్యవహరిస్తోంది. ఇక బిగ్ బెన్ స్టూడియో నుంచి ఇప్పటికే విజయ్ దేవరకొండ నటించిన ‘పెళ్లి చూపులు’, ’డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ కూడా అలరిస్తుందని నమ్ముతున్నారు.
Happy to launch the trailer of https://t.co/lIhX8LfYuS
From the producer of , played a big part in our dreams get a platform, is now backing another bunch of new talent, I wish this young talented team all success 🤗❤️… pic.twitter.com/4SmpUqPTg9