ఆమె నడుముపై చేయి వేసి.. 66 ఏళ్ల వయసులో అవేం పాడు పనులు అనిల్ భాయ్, వైరల్ వీడియో

Published : Jul 02, 2023, 06:49 PM IST
ఆమె నడుముపై చేయి వేసి.. 66 ఏళ్ల వయసులో అవేం పాడు పనులు అనిల్ భాయ్, వైరల్ వీడియో

సారాంశం

ఆదిత్య రాయ్ కపూర్, శోభిత ధూళిపాళ, బాలీవుడ్ దిగ్గజం అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ది నైట్ మ్యానేజర్ 2' వెబ్ సిరీస్ ప్రస్తుతం విజయవంతంగా డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.

ఆదిత్య రాయ్ కపూర్, శోభిత ధూళిపాళ, బాలీవుడ్ దిగ్గజం అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ది నైట్ మ్యానేజర్ 2' వెబ్ సిరీస్ ప్రస్తుతం విజయవంతంగా డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. మొదటి భాగం రిలీజైన నాలుగు నెలల్లోనే సెకండ్ పార్ట్ ని కూడా మేకర్స్ తీసుకువచ్చారు. 

నైట్ మ్యానేజర్ 2తో ప్రస్తుతం ఇండియా మొత్తం శోభిత ధూళిపాళ పేరు మారుమోగుతోంది. గ్లామర్, రొమాంటిక్ సీన్స్ లో శోభిత రెచ్చిపోయి నటించింది. జీ కార్ద, లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లలో తమన్నా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించడం హాట్ టాపిక్ అయింది. ఆ ట్రెండ్ కొనసాగిస్తూ నైట్ మేనేజర్ లో తెలుగు బ్యూటీ శోభిత శృంగార సన్నివేశాలతో తెగించింది. 

అయితే నైట్ మ్యానేజర్ 2 కోసం శోభిత గత కొన్ని వారాలుగా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల ప్రమోషనల్ ఈవెంట్ లో శోభిత, అనిల్ కపూర్ మధ్య జరిగిన సంఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. శోభిత ధూళిపాళ, అనిల్ కపూర్ ఇద్దరూ మీడియా కెమెరాలకు ఫోజులు ఇస్తూ నిలబడ్డారు. ఇద్దరూ దగ్గరగా నిలబడితే ఎలాంటి తప్పు లేదు. అనిల్ కపూర్ ప్రెండ్లీగా  శోభిత ధూళిపాళ నడుముపై చేయి వేసినా పర్వాలేదు. 

కానీ అనిల్ కపూర్ శోభిత నడుముని నొక్కుతూ ఆమెని దగ్గరగా లాక్కుంటూ అందరి ముందు తన చిలిపి ప్రతాపం చూపించాడు. అనిల్ కపూర్ లాంటి 66 ఎల్లా సీనియర్ అలా చేస్తుండడంతో శోభిత ఏం చేయలేక సిగ్గుతూ నవ్వుతూ ఉండిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వయసులో ఇవేం పనులు అనిల్ భాయ్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

దీనితో సీనియర్ హీరోలు, యంగ్ హీరోయిన్ల జోడిలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఏది ఏమైనా శోభితకి మాత్రం నైట్ మ్యానేజర్ తో పాపులారిటీ మరింత పెరిగింది. 

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో