ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్, తారక్ ముందు స్టార్ ప్రొడ్యూసర్ సినిమా ప్రపోజల్

Published : Mar 25, 2023, 01:14 PM ISTUpdated : Mar 25, 2023, 01:16 PM IST
ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్, తారక్ ముందు స్టార్ ప్రొడ్యూసర్ సినిమా ప్రపోజల్

సారాంశం

RRR తో   గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ కోసం ప్రస్తుతం..  బాలీవుడ్ మేకర్స్ క్యూ కడుతున్నారు. ఒక్క సినిమా చేయండంటూ... బ్రతిమలాడుతున్నారు.  మరి ఎన్టీఆర్ నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు. 


టాలీవుడ్ హీరోల కోసం తారాడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటటంతో.. బాలీవుడ్ మేకర్స్ మన హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా హీరోలుగా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, లకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు అందగా.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ కోసం కూడా బాలీవుడ్ మేకర్స్ క్యూ కడుతున్నారు. ఒక్క సినిమా చేయడండంటూ... బ్రతిమలాడుతున్నారు. 

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ హడావిడి అయిపోగానే ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాలపై గట్టిగా దృష్టి పెట్టాడు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ వచ్చాక.. దర్శకుడు కొరటాల శివతో NTR30 మూవీని సెట్స్ ఎక్కించిన యంగ్ టైగర్.. రీసెంట్ గా ఈసినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశాడు. ఎన్టీఆర్ సినిమా కోసం దాదాపు ఏడాదిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఎట్టకేలకు మూవీ లాంచ్ అవ్వడంతో దిల్ ఖుష్ అయ్యారు. 

ఈ సినిమా తర్వాత తారక్ మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.  కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీని గతంలోనే అనౌన్స్ చేశాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. ఇక గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ తో ఈ ఇద్దరు దర్శకులు సినిమాలు ఎలా చేయబోతున్నార అనేది ఆసక్తి కరంగా మారిన తరుణంలో.. ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ నుంచి వరుసఆఫర్లు అందుతున్నట్టు తెలుస్తోంది. బీటౌన్ మేకర్స్ తారక్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఈ విధంగా ఆయన దగ్గర ప్రపోజల్స్ కూడా పెడుతున్నట్టు తెలుస్తోంది. 

 

ఈక్రమంలోనే తారక్ ఓ స్టార్ ప్రొడ్యూసర్ తో సినిమా కమిట్ అయ్యాడు అంటూ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్.. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఇంతకీ ఆ బడా  ప్రొడ్యూసర్ ఎవరంటే..?  ప్రస్తుతం  ప్రభాస్, అల్లు అర్జున్ లతో సినిమాలు నిర్మిస్తున్న టిసిరీస్ భూషణ్ కుమార్. ఈయనతోనే ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా లాంచ్ అయిన ఎన్టీఆర్ 30 వేడుకల్లో కూడా ముంబయ్ నుంచి  భూషన్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.  దాంతో ఈసినిమా రూమర్స్ నిజమే అని తెలుస్తోంది. 

అయితే భూషన్ ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలు పూర్తి చేసేలోపు..తారక్ ఎన్టీఆర్ 30 తో పాటు ప్రశాంత్ నీల్ తో సినిమాలు కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట. ఆరతువాత వీరి కాంబోలో భారీ బడ్జెట్ తో సినిమా వస్తుంది అంటున్నారు మేకర్స్. త్వరలోనే ఎన్టీఆర్ తో టీ సిరీస్ వారు  సినిమా అనౌన్స్ చేయనున్నరని సమాచారం. ఎందుకంటే.. భూషణ్ కుమార్ ఏ ఈవెంట్ కి అంత ఈజీగా రాడు. అలాంటిది ఎన్టీఆర్ మూవీ లాంచ్ కే వచ్చాడంటే.. ఒకటి ఫ్యూచర్ లో ఎన్టీఆర్ తో సినిమా నిర్మించడానికి అయినా వచ్చి ఉండాలి. లేదా ఎన్టీఆర్-కొరటాల మూవీకి సంబంధించి హిందీ రైట్స్ అయినా తీసుకొని ఉండాలంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ