మంచు మనోజ్ షేర్ చేసిన వీడియోతో మంచు ఫ్యామిలీలోని వివాదం రోడ్డున పడ్డ విషయం తెలిసిందే. రెండ్రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తాజాగా మంచు లక్ష్మి స్పందించారు.
మంచు ఫ్యామిలీలో విబేధాలు తలెత్తుతున్నాయని ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిపై ఎప్పుడూ ఎవరు ఓపెన్ కాలేదు. కానీ ప్రస్తుతం వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నిన్న ఉదయం మంచు మనోజ్ (Manchi Manoj) షేర్ చేసిన వీడియోతో స్పష్టమైంది. వీడియోలో సారథి అనే వ్యక్తి ఇంట్లో మనోజ్ ఉండగా.. మంచు విష్ణు ఏకంగా ఇంట్లోకి వచ్చి మరీ దాడి చేయడం, వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనలో సారథి స్వల్పంగా గాయపడ్డారని, ఆయనకు చికిత్స కూడా అందించారని తెలుస్తోంది.
నిన్న సోషల్ మీడియాలో మంచు మనోజ్ విష్ణు ప్రవర్తను సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడం.. తండ్రి మోహన్ బాబు సీరియస్ అవడంతో డిలీట్ చేయడం.. అంతా తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం మంచు లక్ష్మినే ఇద్దరు అన్నదమ్ములను సముజాయించే బాధ్యత తీసుకున్నారని కూడా తెలుస్తోంది. నిన్నకూడా ఇద్దరితో మాట్లాడి శాంతింపజేశారని అంటున్నారు.
ఈ మేరకు అన్నదమ్ముల వివాదంపైనా తాజాగా అక్క Manchu Lakshmi స్పందించారు.
ప్రతి ఇంట్లో అన్నదమ్ముల మధ్య సాధారణ గొడవలు ఉంటాయి. దీన్ని ఇంట్లో గొడవగానే పరిగణించాలి. దీనిపై అనవసరమైన రాద్ధాంతం చేయాల్సి అవసరం లేదని సూచించారు. త్వరలోనే ఇద్దరి మధ్య వివాదం పరిష్కారమవుతుందని చెప్పుకొచ్చారు. విషయం పూర్తిగా తెలియకుండా ఎలాంటి అభిప్రాయాలను స్ప్రెడ్ చేయకూడదని కోరింది. ఇక ఇప్పటికే తండ్రి మోహన్ బాబు ఇద్దరు కొడుకులను మందలించినట్టు తెలుస్తోంది. ఆయనే రంగంలోకి దిగి ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ నెల మార్చి 3, 4న మంచు మనోజ్ - మౌనికా రెడ్డి పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వీరిచ పెళ్లికి అక్క మంచు లక్ష్మినే పెళ్లి పెద్దగా వ్యవహరించారు. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య పెళ్లి వేడుకను జరిపించారు. తండ్రి మోహన్ బాబు కూడా పెళ్లికి హాజరై మనోజ్ - మౌనికాను ఆశీర్వదించారు. కానీ అన్న మంచు విష్ణు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లడం గమనార్హం. దీంతో అంతకు ముందే మంచు విష్ణు, మనోజ్ కు వైరం ఏర్పడినట్టు అర్థం అవుతోంది. అప్పటికే మనోజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి విడిగా ఉన్నారనీ ప్రచారం జరిగింది. ఏదేమైనా మంచు ఫ్యామిలీలో వివాదాలు సద్దుమణగాలని అభిమానులు కోరుకుంటున్నారు.