Brahmamudi: అక్క, చెల్లెల మధ్య నిప్పు పెట్టిన రాహుల్.. తల్లిని ఇంటికి రావద్దంటూ షాకిచ్చిన కావ్య?

Published : Mar 25, 2023, 12:18 PM IST
Brahmamudi: అక్క, చెల్లెల మధ్య నిప్పు పెట్టిన రాహుల్.. తల్లిని ఇంటికి రావద్దంటూ షాకిచ్చిన కావ్య?

సారాంశం

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ అందరి హృదయాలని దోచుకుంటూ మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటుంది. తనలాంటి పేద బ్రతుకు తన కూతుర్లకి రాకూడదని తపన పడుతున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభంలో మీ చెల్లెలు నీ గురించి చెడుగా చెప్పింది నువ్వు వస్తే తన రాణివాసం ఎక్కడ పోతుందో అని తన భయం. ఇప్పుడు నేను నిజం చెప్తే నన్ను కూడా ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు ఆస్తి అంతస్తు వదులుకొని నేను కూడా నీ కోసం రావడానికి రెడీయే మరీ నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు రెడీయేనా అని అడుగుతాడు రాహుల్.

ఆస్తి పోతే ఇంక నాకు తనకి తేడా ఏముంటుంది అనుకుంటూ పెళ్లి ఎప్పుడైనా చేసుకుందాం రాహుల్ కానీ మనకి కావాల్సింది పోయిన పరువు తిరిగి తెచ్చుకోవడం ఎప్పుడైతే మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో అప్పుడే పెళ్లి చేసుకుందాం అంటుంది స్వప్న. అంతలోనే కావ్య రావడం గమనించి స్వప్నని అక్కడి నుంచి తప్పించేస్తాడు రాహుల్. అక్క చెల్లెలు ఇద్దరు మధ్య నిప్పు పెట్టాను ఇక నేను సేఫ్ అనుకుంటాడు రాహుల్.

మరోవైపు అర్ధరాత్రి ఇంటికి వచ్చిన కనకం కామ్ గా ఇంట్లోకి వెళ్లిపోతుంటే కృష్ణమూర్తి ఎదురవుతాడు. నన్ను తిడతావా అని అడుగుతుంది కనకం. నా భార్య ని తిట్టే హక్కు ఉంది కానీ ఒక తల్లిని తిట్టే హక్కు లేదు ఇంతకీ నా బిడ్డ అక్కడ ఎలా ఉంది అని అడుగుతాడు కృష్ణమూర్తి. బాగానే ఉందయ్యా అందనంత ఎత్తులో ఉంది అంటుంది కనకం. నువ్వు చెప్పే అబద్ధాలు విని నిజం కూడా అబద్ధం లాగే అనిపిస్తుంది అంటాడు కృష్ణమూర్తి.

లేదయ్యా ఇది మాత్రం నిజం అందరూ పుష్పగుచ్చాలు ఇస్తుంటే నా దగ్గర ఇవ్వటానికి ఒక్క రోజా పువ్వు కూడా లేదు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది కనకం. కన్న తండ్రివి కదా నువ్వు కూడా చూసి ఉంటే బాగుండేది అంటుంది కనకం. ఈ కన్నతల్లి కళ్ళల్లో కనిపిస్తున్నాయి అంటూ తను కూడా కన్నీరు పెట్టుకుంటాడు కృష్ణమూర్తి. అందరి మధ్యలోనే నా కూతురు చందమామ లాగా వెలిగిపోయింది అంటే చందమామ అందం నిజం కాదు.

అది సూర్యుని నీడ మాత్రమే నా కూతురు కూడా అలాగే చిరునవ్వుని పెదాలపై అద్దుకుందేమో అంటాడు కృష్ణమూర్తి. నీ మోహన వేసుకున్న రంగులన్నీ ఎప్పుడు తుడిచేసుకున్నావు అని అడుగుతాడు కృష్ణమూర్తి. ఆ మాట విని షాక్ అవుతుంది కనకం. నువ్వు రావటం ఆలస్యమైందని మీ మీనాక్షి అక్కని అడిగితే జరిగిందంతా చెప్పింది.

అబద్ధాలు ఆడి, ఆడి ఒక అమ్మ జోకర్ అయింది అని నీ మీద కోపం రాలేదు బాగా జాలి వేసింది అంటాడు కృష్ణమూర్తి. భర్తను పట్టుకొని ఏడుస్తుంది కనకం. మరోవైపు కళ్యాణ్ తో మా అమ్మని మరొకసారి కలిసే ఏర్పాట్లు చేయకండి. నన్ను కలవడానికి రకరకాల వేషాలు వేస్తుంది ఏ ఒక్కటి ఫెయిల్ అయిన ఈ ఇంట్లో నా స్థానం దిగజారిపోతుంది. మా అమ్మ మీద ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఏర్పడిన అభిప్రాయం అంత తొందరగా పోదు.

అందుకే ఈసారి మా అమ్మ వస్తే నన్ను కలవడం కుదరదని కచ్చితంగా చెప్పేయండి అని చెప్తుంది. అంత కఠినంగా ఎలాగ మాట్లాడగలుగుతున్నారు, అమ్మతనాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు ఎవరు, మీరు ఎవరు నేనెవరు నా ప్రయత్నం మాత్రమే చేస్తాను అంటాడు కళ్యాణ్. మరోవైపు కావ్య ఇంట్లోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్న అప్పుని వాచ్మెన్ అడ్డుకుంటాడు.

వాచ్మెన్ ఫోన్ మాట్లాడే సమయంలో దొంగతనంగా ఇంట్లోకి దూరిపోతుంది అప్పు. ఏ హడావిడి లేదు అప్పుడే రిసెప్షన్ అయిపోయిందా అనుకుంటుంది. ఇంతలో కృష్ణమూర్తి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. అమ్మ కోసం మీ వియ్యంకులు ఇంటికి వచ్చాను అంటుంది అప్పు. అక్కడ ఏ తప్పు చేసిన మీ అక్కకి ప్రమాదంగా మారుతుంది. మీ అమ్మ ఇందాకే వచ్చేసింది నువ్వు తొందరగా ఇంటికి వచ్చేయ్.

కావ్య అక్కని చూడాలి అంటూ పిచ్చి వేషాలు వేయకు  అంటాడు కృష్ణమూర్తి. చూడొద్దన్నావ్ కదా ఖచ్చితంగా చూసే వస్తాను అంటుంది అప్పు. మరోవైపు కావ్య గది దగ్గరికి వస్తుంది అపర్ణ. కావ్య లోపలికి రమ్మంటే ఇది ఒక పాద సామాన్లు పడేసే గది నేను నీ ఆహ్వానం కోసం చూడటం లేదు నేను ఆ నగల కోసం వచ్చాను. ఆ నగలు వేసుకునే అర్హత నీకు లేదు అంటుంది అపర్ణ. నగలన్నీ అపర్ణకి  ఇచ్చేస్తుంది కావ్య.

నగల మీద మోజు లేనప్పుడు అవన్నీ ఎందుకు దిగేసుకున్నావు అంటుంది అపర్ణ. సొసైటీ కోసం మీ అబ్బాయి నాకు ఈ రిచ్ వేషం వేశారు అంటుంది అపర్ణ. రిచ్గా కనిపించడం కోసం  ఏమైనా చేయటం మీకు అలవాటే కదా అంటుంది అపర్ణ. ఏమైనా అంటే నన్ను అనండి అంతేకానీ మా వాళ్ళని ఏమి అనకండి అమ్మమ్మ గారు బలవంతం చేయడంతో ఈ గంగిరెద్దు 
వేషం వేసుకున్నాను మరెప్పుడూ ఈ నగలు ఇవ్వకండి అలాగే మీ అబ్బాయి కూడా చెప్పండి.

 పదిమందిలో ప్రదర్శించడానికి పెళ్ళామేమీ కొత్తగా డిజైన్ చేసిన నగ కాదు అని. నీకు నన్ను అత్తయ్య అని పిలిచే హక్కు లేదు అంటుంది అపర్ణ. మీరు నన్ను కోడలుగా అంగీకరించే వరకు నేను మిమ్మల్ని మేడమ్ అని పిలుస్తాను అంటుంది  కావ్య. నువ్వు ఎలా పిలిచినా నిన్ను కోడలుగా అంగీకరించేది  లేదుఅంటూ శాంత ని పిలిచి ఆ నగలని శుభ్రంగా కడిగి తన గదిలో పెట్టించమంటుంది.

 మరోవైపు నక్కి, నక్కి వస్తున్న అప్పు ని పక్కకి లాగుతాడు కళ్యాణ్ . ఎందుకు అలా చేసావు కానీ అప్పు అడిగితే  వాచ్మెన్ ని చూపిస్తాడు. అయినా ఏంటి బ్రో అంటాడు కళ్యాణ్. నేనెవరో తెలిసాక కూడా బ్రో అంటావేంటి అంటూ పొట్టలో గుద్దుతుంది అప్పు. ఇలా మగవాడిలాగా కొడుతుంటే బ్రో అనకపోతే ఏమంటారు అంటాడు కళ్యాణ్.

 తరువాయి భాగంలో శోభనానికి ముహూర్తం పెట్టిస్తారు సీతారామయ్య దంపతులు. అక్కడ శోభనానికి ముహూర్తం పెట్టిస్తున్నారు నాకు ఇష్టం లేదని చెప్పు అని కావ్య తో చెప్తాడు రాజ్. నాకు ఇష్టమే అంటుంది కావ్య. ఆ మాటలకి షాక్ అవుతాడు రాజ్.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు