
బాలీవుడ్ మేకర్స్ 'ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ' టైటిల్ తో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. ఉరి: ది సర్జికల్ స్ట్రైక్స్ ఫేమ్ ఆదిత్య థార్ ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ చిత్రంలో మొదట హీరోగా విక్కీ కౌశల్ అనుకున్నారట. అలాగే రణ్వీర్ సింగ్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చిందట. తాజాగా ఎన్టీఆర్, అల్లు అర్జున్ లను హీరోగా తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు ఓ వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.
మహాభారతం స్ఫూర్తితో తెరకెక్కే ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ చిత్రంలో పలు కీలక పాత్రలు ఉంటాయి. ఈ క్రమంలో హీరోలుగా అల్లు అర్జున్, ఎన్టీఆర్ నటించే అవకాశం కలదంటున్నారు. లేదంటే వీరిద్దరిలో ఒకరు నటించే ఛాన్స్ ఉందట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. ఆల్రెడీ ఎన్టీఆర్ వార్ 2 చిత్రానికి సైన్ చేశారు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
తాజాగా ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ మూవీలో ఎన్టీఆర్ నటించే అవకాశం కలదంటూ వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ లైన్ అప్ చూస్తే... కొరటాల శివతో 30వ చిత్రం చేస్తున్నారు. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఒక చిత్రం ప్రకటించారు. వార్2 దాదాపు ఖాయమైంది. వెట్రిమారన్ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 పూర్తి చేస్తున్నారు. పుష్ప 2 సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
ఇక సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ఒక చిత్రం చేయాల్సి ఉంది. సందీప్ చిత్రానికి ముందే త్రివిక్రమ్ తో మూవీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. నందమూరి-మెగా హీరోలు కలిసి మూవీ చేయడం రేర్ కాంబినేషన్. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఇది సాకారం అయ్యింది. అల్లు అర్జున్-ఎన్టీఆర్ కలిసి నటిస్తే ఆ చిత్రం మరో ప్రభంజనం అవుతుంది...