'రావణాసుర' డిజాస్టర్..ఎంత నష్టం తెచ్చింది?

Published : Apr 17, 2023, 09:29 AM IST
'రావణాసుర'  డిజాస్టర్..ఎంత నష్టం తెచ్చింది?

సారాంశం

రవితేజ మొదటిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు హింట్ ఇవ్వడంతో సినిమా మీద అందరిలోనూ తీవ్రమైన ఆసక్తి నెలకొంది.  


 రవితేజ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో రూపొందిన  రావణాసుర చిత్రం మార్నింగ్ షోకే డిజాస్టర్ అయ్యిపోయిన సంగతి తెలిసిందే. సరైన కథ,కథనాలు లేకుండా కేవలం రవితేజ నెగిటివ్ షేడ్ లో చూపించి క్యాష్ చేసుకోవాలనే దర్శక,నిర్మాతల తాపత్రయం భారీ నష్టాల దిసగా ప్రయాణం పెట్టుకుంది. రిలీజ్ కు ముందు ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచే విధంగా ఈ సినిమా కోసం ఐదుగురు హీరోయిన్లను తీసుకోవడం, రవితేజ మొదటిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు హింట్ ఇవ్వడంతో సినిమా మీద అందరిలోనూ తీవ్రమైన ఆసక్తి నెలకొంది.

అయితే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటి నుంచి నెగిటివ్ రెస్పాన్స్ దక్కించుకోవటంతో వెంటనే కలెక్షన్స్ డ్రాప్ స్టార్ట్ అయ్యింది. మొదటి వీకెండ్ ని కూడా దాటలేక చతికిలపడింది. ట్రేడ్ లెక్కల ప్రకారం  8 రోజులలో ఈ సినిమా కేవలం 11.81 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఈ క్రమంలో సినిమా కొనుక్కున్న వాళ్లకు భారీ దెబ్బ. రవితేజ గత రెండు సినిమాలు ధమాకా వాల్తేర్ వీరయ్య ఏకంగా గ్రాస్ పరంగా వంద కోట్ల క్లబ్ లో చేరటంతో రావణాసుర మూవీకి రవితేజ కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ జరగింది.  దాంతో ఇప్పుడు ఎక్కువ రేట్లు తీసుకున్న వాళ్లంతా నష్టపోయారు. వారంతా ఇప్పుడు నిర్మాతని రికవరీ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తమ తదుపరి చిత్రంలో చూసుకుందామని చెప్తున్నట్లు వినిపిస్తోంది. రవితేజ కూడా ఈ సినిమాకు నిర్మాతే. 

ఇక ఈ చిత్రం ఓటిటి రైట్స్ కూడా భారీగానే అమ్మారని, అయితే పూర్తి పేమెంట్ అవ్వలేదని...ఇప్పుడు రిజల్ట్ తేడా కొట్టడంతో అందులో కోత పడుతుందని అంటున్నారు. అయితే ఓటిటి, శాటిలైట్ ద్వారా రికవరీ అవ్వటం నిర్మాతగా అభిషేక్ పిక్చర్స్ వారికి పెద్దగా నష్టపోయేదేమీ లేదని అంటున్నారు. కొనుక్కున్న వాళ్లకు సెటిల్మెంట్ చేస్తే చాలు అని చెప్పుకుంటున్నారు. ఓవరాల్ గా పెద్ద లాస్ ఉండదని చెప్తున్నారు. రవితేజ వంటి స్టార్ హీరో సినిమాతో సినిమా చేయటం వల్ల కలిసొచ్చిన విషయం అంటున్నారు. కానీ మరో దెబ్బ ఇలాంటిది పడితే రవితేజ నెక్ట్స్ సినిమాల బిజినెస్ పై ఆ ఇంపాక్ట్ డైరక్ట్ గా పడుతుందనేది మాత్రం నిజం. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?