నేను చేసిన తప్పు అదే, కడుపు కొట్టుకుంటూ బైక్ యాక్సిడెంట్ ని గుర్తు చేసుకుని ఏడ్చేసిన తేజు

Published : Apr 16, 2023, 10:43 PM IST
నేను చేసిన తప్పు అదే, కడుపు కొట్టుకుంటూ బైక్ యాక్సిడెంట్ ని గుర్తు చేసుకుని ఏడ్చేసిన తేజు

సారాంశం

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. 90 దశకం వరకు పలు గ్రామాల్లో ఉన్న మూఢనమ్మకాలు, చేతబడి లాంటి వ్యవహారాలపై ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ దండు విజువల్ థ్రిల్లర్ గా రూపొందించారు.

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. 90 దశకం వరకు పలు గ్రామాల్లో ఉన్న మూఢనమ్మకాలు, చేతబడి లాంటి వ్యవహారాలపై ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ దండు విజువల్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఏప్రిల్ 21న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న తరుణంలో నేడు ఏలూరులో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. 

ప్రీ రిలీజ్ వేడుకకు సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్, కార్తీక్ దండు ఇతర చిత్ర యూనిట్ హాజరయ్యారు. ఇక స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు అతిథిగా హాజరయ్యారు. సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత వస్తున్న తొలి చిత్రం ఇదే. దీనితో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. 

ఈ తరుణంలో సాయిధరమ్ తేజ్ ప్రీ రిలీజ్ వేడుకలో ఎమోషనల్ గా ప్రసంగించారు. ఎప్పుడూ సరదాగా కనిపించే తేజు తొలిసారి బైక్ ప్రమాదాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. 

2021 సెప్టెంబర్ 10న నేను అనుకోకుండా బైక్ నుంచి జారి పడ్డాను. నేను చేసిన తప్పల్లా బైక్ తీసుకుని నడపడమే. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే. మీ అందరిని నేను టెన్షన్ పెట్టాను. నన్ను క్షమించండి అని తేజు కోరారు. వారం రోజుల తర్వాత కానీ నేను స్పృహలోకి రాలేదు. కళ్ళు తెరవగానే మా అమ్మ, తమ్ముడిని చూశాను. 

వాళ్ళకి కూడా సారీ చెబుదామని నోరు తెరిస్తే మాట రాలేదు. నా మాట పడిపోయింది. మా అమ్మకి సారీ చెప్పలేకున్నా అని కడుపులో భాద వచ్చింది అంటూ తేజు కడుపు కొట్టుకుంటూ వేదికపై ఏడ్చేశాడు. ఈ ప్రమాదం నుంచి నేను జీవితం అంటే ఏంటో రియలైజ్ అయ్యా. నేను ఇప్పుడు జీవితాన్ని చూసే విధానం మార్చుకున్నా. ఇక నుంచి ఇంకా కష్టపడతా.. మీ ప్రేమని పొందుతా అంటూ తేజు అభిమానులని ఉద్దేశించి ప్రసంగించారు. యువత అందరూ హెల్మెట్ ధరించి బైక్ నడపాలని తేజు ఈ సందర్భంగా వేదికపై కోరారు. తేజు మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?