Kangana Ranaut: కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీ..? పోటీ ఎక్కడి నుంచంటే..?

Published : Dec 20, 2023, 05:24 PM ISTUpdated : Dec 20, 2023, 05:26 PM IST
Kangana Ranaut: కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీ..? పోటీ ఎక్కడి నుంచంటే..?

సారాంశం

బాలీవుడ్ లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్.. ముక్కుసూటిగా వెళ్లే ఈ తార త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? వచ్చే ఎన్నికల్లో పోటీకూడా చేయబోతుందా..?

బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది హీరోయిన్ కంగనారనౌత్‌. ఆమె త్వరలో  ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్టుతెలుస్తోంది. అంతే కాదు వచ్చే ఏడాది జరగబోతయే ఎన్నటికల్లో పోటీకూడా చేయబోతున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం స్వయంగా కంనగా రనౌత్ తండ్రి  అమర్‌దీప్‌ రనౌత్‌ క్లారిటీ ఇచ్చారు. అయితే ఆమె పోటీ చేసే స్థానం పై మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. ఈ విషయంలో కంగనా మాత్రం స్వయంగా స్పందించాల్సి ఉంది. 

అయితే ఆమె బీజేపీకి సపోర్ట్ గా ఉంది. ఆ పార్టీ నుంచే ఆమె లోక్‌సభకు పోటీ చేస్తుందని సమాచారం. అయితే ఆమె పోటీచేసే స్థానం  ఏంటీ అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని  పార్టీ నిర్ణయిస్తుందని ఆమె తండ్రి వెల్లడించారు.  ఈమధ్య ఆమె శ్రీకృష్ణుడి మందిరాన్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా అని మీడియా ప్రశ్నిస్తే.. కృష్ణభగవానుడు ఆశీర్వదాలు ఉంటే తప్పక పోటీ చేస్తానని చెప్పింది. అయితే కంగనా రనౌత్‌ సొంత నియోజకవర్గం హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది. ఆమె ఇక్కడి నుంచే పోటీ చేస్తుందా లేదా అని తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది కంగనా రనౌత్. ఆమె హిందీలోకంటే కూడా సౌత్ లోనే ఎక్కువ యాక్టీవ్ గా ఉంది.  హిందీతో పాటు  తమిళం, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తోంది. ఈమధ్య తమిళంలో ఎక్కువగా యాక్టీవ్ అయ్యింది.  పాన్‌ ఇడియా స్టార్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె బాలీవుడ్ లో నటిస్తున్నసినిమా ఎమర్జెన్సీ. ఈసినిమాలో ఆమె  ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది.  ఇక బాలీవుడ్ లో నెపోటిజం, క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తోంది బ్యూటీ. ఒక రకంగా చెప్పాలంటే... బాలీవుడ్ ఈమెను దూరం పెట్టిందని చెప్పుకోవచ్చు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు