
అడవి శేష్, శృతి హాసన్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే దీన్ని ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ చేశారు. టైటిల్ టీజర్ అదిరిపోయేలా ఉంది. ఓ విభిన్నమైన టైటిల్ దీనికి నిర్ణయించారు. `డెకాయిట్`గా నిర్ణయించారు. కాప్షన్‌గా `ఒక ప్రేమకథ` అని పెట్టడం విశేషం. ఇక దీనికి సంబంధించిన టైటిల్ టీజర్ ఆకట్టుకుంటుంది.
టైటిల్ టీజర్‌లో.. భారీ బాంబ్ బ్లాస్టింగ్‌లో పోలీసులు, కొంత మంది జనాలు చనిపోయి చెల్లా చెదురుగా పడి ఉన్నారు. వారిలో నుంచి అడవి శేష్ లేచి నిల్చున్నాడు. తాను తేరుకునే లోపు ఓ గజ్జల శబ్దం వినిపించింది. దూరంలో ఓ లేడీ లేచి వచ్చింది. ఆమె శృతి హాసన్. గన్ తీసుకుని అడవి శేష్‌ని కాల్చేందుకు వస్తుంది. శేష్.. ఆమెని చూసేందుకు వస్తున్నారు. ఇద్దరు తలపడ్డారు. ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోయారు. అంతేకాదు గన్నులు ఎక్కుపెట్టుకుని చివరికి కాల్చుకున్నారు.
అయితే ఈ టీజర్‌లో బ్యాక్ గ్రౌండ్‌లో.. జూలియట్.. ఎన్నిరోజులవుతుంది మనం కలిసి అని అడవి శేష్ వాయిస్ వినిపించింది. కలిసి కాదు విడిపోయి అని శృతి వాయిస్ వచ్చింది. అసలు నేను గుర్తున్నానా? అని అతను, నీ మోసం మర్చిపోలేదని శేష్ చెప్పడం, అయితే ఇప్పుడు నేనేంటి? ఎక్స్ అని అడగ్గా, అది ఒకప్పుడు అని శృతి చెబుతుంది. మరి ఇప్పుడేంటి? ఎదవనా? దొంగనా? విలన్ నా? చెప్పు నేనెవరిని అని అడగడం, ఇద్దరు కాల్చుకోవడంతో టీజర్ ముగిసింది.
`డెకాయిట్` టైటిల్ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. సినిమాపై అంచనాలు పెంచుతుంది. ఓ సరికొత్త ప్రేమ కథగా ఇది సాగబోతుందని తెలుస్తుంది. ఒకప్పుడు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాత మోసం కారణంగా విడిపోతారని, బద్ధ శతృవులుగా మారిపోతారని తెలుస్తుంది. మరి ఇందులో పోలీస్ ఎవరు? దొంగ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. షానీల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మించారు. ఎస్ ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ నిర్మిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తుంది. త్వరలో తెలుగు, హిందీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపింది.