
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ఈగల్, టాలీవుడ్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనిని ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కిస్తున్న ఈగల్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఇక తాజాగా ఈసినిమా పై మరింత క్యారియాసిటీ పెంచేలా ఈగల్ ట్రైలర్ నురిలీజ్ చేశారు మూవీటీమ్. మార్గశిరం మధ్యరాత్రి.. ఓ మెండి మోతుబరి.. వచ్చేశాడంటూ ట్రైలర్ కు క్యాప్షన్ ఇచ్చారు. అటు... విధ్వంసం నేనే.. వినాశనం నేనే అంటూ రవితేజ డైలాగ్స్ అద్భుతంగా పేలాయి. ఈ ట్రైలర్ తో మరోసారి సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు రవితేజ.
ఇక వరుస ప్లాప్ లతో ఇబ్బందిపడుతున్నాడు రవితేజ. ఒక రకంగా హ్యాట్రిక్ ఫెయిల్యూర్ నుఅందుకున్నాడు మాస్ మహరాజ్, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరావు, లాంటి డిఫరెంట్ మూసీస్ చేసిన రవితేజ్..హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం పక్కా ప్లానింగ్ తో ఈమూవీని తెరెక్కిస్తున్నాడు. ఈగల్ టైటిల్ తో చేస్తున్న ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య తపర్ హీరోయిన్స్ నటిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ చిత్రం నుంచి ఆల్రెడీ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన మూవీ టీం.. ఇప్పుడు ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
ఈమధ్యనే వరుసగా పాటలు కూడా రిలీజ్ చేశారు ఈగల్ టీమ. కాకపోతే ఈ సినిమాపాటలు పెద్దగా జనాలకు చేరలేదు. మూవీ రిలీజ్ అయ్యి నచ్చితే.. పాటలు కూడా క్లిక్ అయ్యే అవకాశం ఉంది. ఈక్రమంలోనే ఈమూవీపై అంచనాలుపెంచేలా డోస్ పెంచేందుకు ఈగల్ ట్రైలర్ నురిలీజ్ చేశారు టీమ్.
ఇక రవితేజ డిపరెంట్ గా కనిపించబోతున్న ఈమూవీలో కావ్య థాఫర్ మెయిన్ హీరోయిన్ అని.. అనుపమా పరమేశ్వరన్ ది ఈసినిమాలో కీలక పాత్రఅని తెలుస్తోంది. అంతే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ హీరో శ్రీనివాస్ అవసరాల మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
Pallavi Prashanth: షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్.. వీడియో వైరల్
ఇక మంచి బడ్జెట్ తో ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ విడుదల కాబోతుంది. రవితేజ గత చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఆయన ఆశలన్నీ ఈ మూవీపైనే పెట్టుకున్నాడు. తన పాత్రలోని కొత్త యాంగిల్‌ని చూడబోతున్నట్టు తెలిపారు. మరి హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేసిన మాస్ మహారాజ్.. ఈసినిమాతో సాలిడ్ హిట్ కొట్టి..మంచి కమ్ బ్యాక్ ఇవ్వగలడా అనేది చూడాలి.