Shraddha Kapoor Thanks to Fans : ఫ్యాన్స్ కు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ బర్త్ డే కిస్సెస్.. వీడియో వైరల్

Published : Mar 04, 2022, 06:22 PM ISTUpdated : Mar 04, 2022, 06:26 PM IST
Shraddha Kapoor Thanks to Fans : ఫ్యాన్స్ కు బాలీవుడ్ బ్యూటీ  శ్రద్ధా కపూర్ బర్త్ డే కిస్సెస్..  వీడియో వైరల్

సారాంశం

బాలీవుడ్ బ్యూటీ, ప్రభాస్ హీరోయిన్ (Prabhas) శ్రద్దా కపూర్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రద్దాకు బాలీవుడ్ స్టార్స్, ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఇందుకు శ్రద్దా వారి అభిమానానికి ధన్యవాదాలు తెలిపింది.    

బాలీవుడ్ బ్యూటీ  శ్రద్దా కపూర్ (Shraddha Kapoor) ప్రభాస్ నటించిన ‘సాహో’(Sahoo) మూవీలో నటించిన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అటు బాలీవువడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. అయితే  శ్రద్ధా కపూర్ ముంబైలో 1987 మార్చి 3న జన్మించింది.  శ్రద్ధా కపూర్ 35వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ను  ముంబయిలో కాకుండా ఓ స్పెషల్ ప్లేస్ లో నిర్వహించుకుంది. ఇందుకోసం తను ముంబైలోని ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. 

ఆమె బర్త్ డే సందర్భంగా ఫిబ్రవరి 2న శ్రద్ధా కపూర్ రాకా కోసం ఎదురుచూస్తున్నడైహార్డ్ ఫ్యాన్స్ శ్రద్ధా కపూర్ ను కలిసి అడ్వాన్స్ గా బర్త్ డే విషేస్ తెలియజేశారు. ఆమెను సర్ ప్రైజ్ చేస్తూ మెమోరబుల్ గిఫ్ట్ అందించారు. ఇందుకు శ్రద్ధా చాలా సంతోషం వ్యక్తం చేసింది. తన తండ్రి శక్తి కపూర్ (Shakti Kapoor)తో పాటు సెలబ్రేషన్స్ కు బయల్దేరింది.  శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు అనుష్క శర్మ, వరుణ్ ధావన్, కృతి సనన్, రకుల్ ప్రీత్ సింగ్ మరియు టైగర్  ష్రాఫ్, ఇతర నటీనటులు సోషల్ మీడియాలోశుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు అభిమానులు కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ అభిమాన వర్షాన్ని కురిపించారు. ఇందుకు శ్రద్దా స్పందిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఫ్లైయింగ్ కిస్సెస్ విసిరింది. ‘మీ పుట్టినరోజు శుభాకాంక్షలు మాత్రమే సంతోషనిస్తున్నాయి. మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ వీడియో పోస్ట్ చేస్తూ రాసుకొచ్చింది. 

 

ఈ ఏడాదితో శ్రద్ధ కపూర్ 35 ఏండ్లకు చేరుకుంది. కేరీర్ విషయానికి వస్తే.. టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)తో భాగీ 3లో కలిసి నటించింది శ్రద్ధా కపూర్. కొంత గ్యాప్ తర్వాత ఈ ఏడాది మరోసినిమాకు సైన్ చేసింది. దర్శకుడు లవ్ రంజన్ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ