`వినరో భాగ్యము విష్ణుకథ` సెన్సార్‌ రిపోర్ట్.. ఒక్క రోజు ఆలస్యంగా రిలీజ్‌.. ఎందుకంటే?

Published : Feb 11, 2023, 06:09 PM IST
`వినరో భాగ్యము విష్ణుకథ` సెన్సార్‌ రిపోర్ట్.. ఒక్క రోజు ఆలస్యంగా రిలీజ్‌.. ఎందుకంటే?

సారాంశం

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన `వినరో భాగ్యము విష్ణు కథ` మూవీ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. అంతేకాదు రిలీజ్‌ డేట్‌ కూడా మారింది. తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది యూనిట్‌.

యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం సెలైంట్‌గా సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. తాజాగా ఆయన్నుంచి మరో సినిమా రాబోతుంది. `వినరో భాగ్యము విష్ణుకథ` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే వారం రిలీజ్‌ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. నెంబర్‌ నైబరింగ్‌ అనే కాన్సెప్ట్  తో, రెండు షేడ్స్ లో సాగే కథ సినిమాపై ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ, థ్రిల్లర్‌, యాక్షన్‌ ఎలిమెంట్లు ఎంగేజ్‌ చేసేలా ఉన్నాయి. 

తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది.  సెన్సార్ సభ్యుల మన్ననలు పొంది U/A సర్టిఫికెట్ ను సాధించుకుంది. మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. కశ్మీరా కథానాయికగా నటిస్తుంది. మురళీ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుని విడుదల డేట్‌ని కన్ఫమ్‌ చేసుకుంది. అయితే ముందుగా సినిమాని ఈ నెల 17న విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా ఒక్క రోజు ఆలస్యంగా రిలీజ్‌ కాబోతుంది. 

ఈ నెల 18న `వినరో భాగ్యము విష్ణుకథ` ని విడుదల చేస్తున్నట్టు యూనిట్‌ తాజాగా ప్రకటించింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. అయితే ఒక్క రోజు ఆలస్యానికి కారణం `సార్‌` మూవీ అని తెలుస్తుంది. ధనుష్‌ నటించిన `సార్‌` మూవీ తెలుగు, తమిళంలో ఈ నెల 17న రిలీజ్‌ కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సినిమా ఇది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఆయన రిక్వెస్ట్ మేరకు అల్లు అరవింద్‌ ఒక్క రోజు వెనక్కి తగ్గి ఫిబ్రవరి 18న విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదొక ఆరోగ్యకరమైన పరిణామంగా చెప్పొచ్చు. 

ఇదిలా ఉంటే ఇటీవల ట్రైలర్‌ని సాయిధరమ్‌ తేజ్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా అల్లు అరవింద్‌ ఏకంగా నంబర్‌ నైబరింగ్‌ ని రియల్‌ లైఫ్‌లో చేసి చూపించారు. ఓ ఆడియెన్ కి ఫోన్‌ చేసి మాట్లాడారు. తమ సినిమా గురించి చెప్పారు. నంబర్‌ నైబరింగ్‌ కాన్సెప్ట్ తో సినిమా వస్తుందని, చూడాలని తెలిపారు. అయితే ఆడియెన్స్ మాత్రం మొదట సర్‌ప్రైజ్‌తో కూడిన షాక్‌ కి గురయ్యారు. నమ్మలేకపోయారు. ఆ తర్వాత తేరుకున్నారు. ఈ సన్నివేశాలు ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?