సల్మాన్ ఖాన్ సలహా.. తల్లినయ్యానంటూ బాలీవుడ్ నటి కశ్మీర షా కామెంట్స్.. వైరల్

By Asianet News  |  First Published Jul 11, 2023, 5:42 PM IST

బాలీవుడ్ నటి తాజాగా సల్మాన్ ఖాన్ చేసిన సాయం గురించి చెప్పుకొచ్చింది. తనకు పిల్లలు పుట్టకపోవడంతో బాయ్ జాన్ ఇచ్చిన సలహా మేరకు తల్లినయ్యానంటూ తెలిపింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్  ఆసక్తికరంగా మారాయి. 
 


హిందీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి కాశ్మీర షా (Kashmera Shah).  ఇటు తెలుగు, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. బిగ్ బాస్ 1, నాచ్ బలియే 3, ఫియర్ ఫ్యాక్టర్ : ఖత్రోన్ కే ఖిలాడీ 4 వంటి షోలతో టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా  ఐటెం సాంగ్స్ తో అదరగట్టింది. తెలుగులో అక్కినేని నాగార్జున నటించిన ‘రాముడొచ్చాడు’ చిత్రంలో డాన్స్ ర్ గా నటించి అలరించింది. 

1996 నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది. అటు టెలివిజన్, ఇటు సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాశ్మీర తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే సల్మాన్ చేసిన సాయాన్ని చెప్పింది. ఆమెకు రెండు సార్లు పెళ్లైంది. మొదట 2003లో బ్రాడ్ లిట్టర్ మాన్ తో వివాహం జరిగి 2007లో డివోర్స్ తీసుకుంది. ఆ తర్వాత 2013లో బాలీవుడ్ నటుడు, హోస్ట్ కృష్ణ అభిషేక్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పటికి వీరికి పెళ్లై పదేళ్లు దాటింది. 

Latest Videos

అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. రెండో భర్తతో పిల్లల కోసం చాలా సార్లు ప్రయత్నించినట్టు తెలిపింది. కానీ ఫలించలేదన్నారు. ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు చేసిన ప్రయత్నమూ విఫలమైందని చెప్పుకొచ్చింది. ఓ సందర్భంలో సల్మాన్ ఖాన్ ఇచ్చిన సలహాతోనే తల్లినయ్యానంటూ వివరించింది. తన పిల్లలు లేరని తెలిసి బాధపడుతుండగా.. సరోగసీ ద్వారా బిడ్డను ప్లాన్ చేయమని సల్మాన్ ఖాన్ సూచించారంట. ఆయన సలహా మేరకు ప్రయత్నించగా ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యానని చెప్పుకొచ్చింది.

వారి పెళ్లైన నాలుగేళ్లకు, అదీ సల్మాన్ ఖాన్ ఇచ్చిన సలహాతో తల్లిదండ్రులమయ్యామని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సరోగసీని ఎంచుకుందని ట్రోల్స్ కూడా చేశారని గుర్తు చేసుకుంది. ఏదేమైనా తమ ఇంట్లో సందడికి సల్లూ భాయ్ ఇచ్చిన సలహానే కారణమని చెప్పుబూ సంతోషం వ్యక్తం చేసింది. ఇక సల్మాన్ ఖాన్ సెట్స్ లోనూ లేడీ యాక్టర్స్ ను బాగా చూసుకుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సౌకర్యంగాఉండేలా చూసుకుంటారని అప్పట్లో ఓ నటి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా మన సంప్రదాయాలను గౌరవించాలని, అలాగే దుస్తులు ధరించాలని చెప్పుకొస్తారంట. 

click me!