నిహారిక అంత పనిచేసిందా...? చైతన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు.. నిజమెంతా?

Published : Jul 11, 2023, 05:14 PM ISTUpdated : Jul 13, 2023, 10:15 AM IST
నిహారిక అంత పనిచేసిందా...? చైతన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు.. నిజమెంతా?

సారాంశం

గత కొంత కాలంగా.. మెగా ఫ్యామిలీలో విడాకులు వార్తలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. నిహారిక, చైతన్య విడిపోయారు. విడాకులకు రకరకాల కారణాలు వినిపిస్తుండగా..? ఈ విషయంలో చైతన్య తండ్రి రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. 

మెగా డాటర్ నిహారిక , చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా నానుతున్న ఈ విషయం.. రీసెంట్ గానే అఫీషియల్ గా బయటకు వచ్చింది. తాము ఇద్దరం ఒకరికి ఒకరం ఇష్టపూర్వకంగా.. అవగాహనతో విడాకులు తీసుకున్నట్టు నిహారిక ప్రకటించారు. చైతన్య కూడా దాదాపు అలానే మాట్లాడినా.. ప్రస్తుతం వీరి మధ్య ఏం జరిగి ఉంటుందా అని అంతా ఆలోచనలో పడ్డారు. అయితే చైతన్య మనసు ప్రశాంతత కోసం ఓ ఆధ్యాత్మిక యోగా సెంటర్ కు వెళ్లడం.. తనను ఇక్కడికి వచ్చేలాగా చేసిన వారికి చాలా థ్యాంక్స్ అంటూ ఆయన పోస్ట్ పెట్టడం వైరల్ గా  మారింది. 

దాంతో నిహారికి చైతుని అంత టార్చర్ పెట్టిందా అని అనేక ఊహాగానాలు వినిపించాయి. సోషల్ మీడియాలో ఎవరికి కావల్సినట్టుగా వారు కథలు అల్లుకున్నారు ఈ విషయంలో. అయితే ఇప్పటి వరకూ మెగా ఫ్యామిలీ కాని..చైతూ ఫ్యామిలీ కూడా ఈ విడాకుల విషయంలో స్పందించలేదు.  అయితే తాజాగా చైతన్య తండ్రి.. రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ ఈ విషయంలో నిహారిక గురించి సంచలన విషయాలు వెల్లడించినట్టు సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  పలు మీడియా సంస్థల్లోనూ ఈ వార్తలు కనిపించడం గమనార్హం.

ఆ వార్తల ప్రకారం.. చైతన్య తండ్రి ప్రభాకర్‌రావు తన సన్నిహితుల వద్ద.. అసలు విషయాలు వెల్లడించారట. విడాకులకు కారణం ఏంటీ అనేది చెప్పుకున్నట్టు నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను ఉద్యోగరీత్యా గౌరవమైన హోదాలో ఉన్నప్పటికీ నిహారిక ఇంట్లో పెద్ద వాళ్లతో ఒక్క రోజు కూడా గౌరవంగా ఉండలేదట  భర్తతో కలిసి జీవించాలనే ఆలోచన తనకు లేదని, భర్తను, అత్త మామలను గౌరవించడం తెలియదని, తన భర్త పై కనీసం ఎప్పుడూ ప్రేమ చూపించలేదని, పద్దతిగా  ఎప్పుడు చూసిన క్లబ్బులు, పబ్బులు అంటూ తిరగడమే తప్ప కుటుంబం గురించి ఒక్కక్షణం కూడా ఆలోచించలేదని, ఆమె అంత చేసినా.. మెగా ఫ్యాన్స్ మాత్రం నిజం తెలుసుకోకుండా.. నా కుమారుడి గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని తన సన్నిహితుల వద్ద  జొన్నలగడ్డ ప్రభాకర్ రావు వాపోయినట్టు ఈ రూమర్స్ సారాంశం.

మరి నిజంగానే ఆయన ఈ వ్యాఖ్యలుచేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఓ పెద్ద హోదాలో ఉన్న ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరని, ఇది కొందరు కావాలని పుట్టించిన రూమర్స్ అని మరో వాదన వినిపిస్తుంది. మరి ఇందులో నిజమేంటనేది మాత్రం నిహారిక గానీ, చైతన్య గానీ ఓపెన్‌ అయితేగానీ తెలియదు. అప్పటి వరకు వచ్చేవన్నీ రూమర్స్ గానే మిగిలిపోతాయనేది నిజం. కానీ మెగా ఫ్యామిలీలో విడాకుల మ్యాటర్ ఇంటా..బయటా.. హాట్ టాపిక్ అవుతోందనేది మరో నిజం. 


 

PREV
click me!

Recommended Stories

డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా
2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా