చిరంజీవికి నో చెప్పిన డీజే టిల్లు?

Published : Jul 11, 2023, 04:56 PM ISTUpdated : Jul 11, 2023, 05:02 PM IST
చిరంజీవికి నో చెప్పిన డీజే టిల్లు?

సారాంశం

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో జోరుమీదున్న చిరంజీవి నెక్స్ట్ మూవీపై హింట్ ఇచ్చారు. ఆయన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ మూవీలో కీలక రోల్ చేయడానికి సిద్దు జొన్నలగడ్డ నో చెప్పారట.   

మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఏడాది వ్యవధిలో ఆయన మూడు చిత్రాలు విడుదల చేశారు. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వెంటనే వెంటనే విడుదలయ్యాయి. మరో ముప్పై రోజుల్లో భోళా శంకర్ విడుదలకు సిద్ధం చేశాడు. ఏ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 11న విడుదల కానుంది. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ తమిళ చిత్రం వేదాళం రీమేక్. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్ర చేశారు.

భోళా శంకర్ చిత్ర డబ్బింగ్ పూర్తి చేసిన చిరంజీవి అమెరికా వెకేషన్ కి వెళ్లారు. భార్య సురేఖతో పాటు షార్ట్ వెకేషన్ ప్లాన్ చేశారు. తిరిగి వచ్చిన వెంటనే ఆయన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది కామెడీ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ మూవీలో చిరంజీవి పక్కన ఒక యంగ్ హీరో నటించనున్నారని తెలుస్తుండగా, డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డను తీసుకున్నారట. 

అయితే సిద్దు జొన్నలగడ్డ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడనే ప్రచారం జరుగుతుంది. హీరోగా ఎదుగుతున్న క్రమంలో సపోర్టింగ్ రోల్ చేయడం సరికాదని ఆయన భావిస్తున్నారని వినికిడి. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. కాగా ఇది మలయాళ  చిత్రం బ్రో డాడీ రీమేక్ అని సమాచారం. మోహన్ లాల్, పృథ్వి రాజ్ చేసిన పాత్రల్లో చిరంజీవి, సిద్ధు నటించాల్సి ఉందట. 
 

PREV
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా