సల్మాన్ ఖాన్ బట్టతల వీడియో లీక్.. షాక్ అయిన ఫ్యాన్స్

Published : Aug 21, 2023, 11:28 AM IST
 సల్మాన్ ఖాన్  బట్టతల వీడియో లీక్..  షాక్ అయిన ఫ్యాన్స్

సారాంశం

ఇన్‌స్టాగ్రామ్‌లో సల్మాన్ బట్టతల వీడియో(Salman Bald Video) బాగా వైరల్ అవుతోంది. అయితే నిజంగానే సల్మాన్ ఇలా ఉన్నారా అనేది ప్రశ్నార్దకంగా మారింది. 


తమ అభిమాన హీరోలను తెరపై చూసి మురిసిపోతూంటారు అభిమానులు. వారి లుక్స్ ని, డ్రస్,స్టైల్స్ ని అనుకరిస్తూంటారు. అయితే తెరపై ఉన్నట్లే నిజ జీవితంలో ఉండాలంటే కష్టం. అందుకే కొందరు బయిటకు మేకప్,విగ్  లేకుండా వచ్చేస్తూంటారు.అలా బయిటకు బట్టతలతో తెల్ల గడ్డంతో కనపడే సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన తెరపై కనపడినట్లు బయిట కనపడటానికి ఇష్టపడరు. సింపుల్ గా ఉంటారు. అయితే చాలా మంది హీరోలు ఇది ఇష్టపడరు. కానీ అనుకోకుండా వాళ్ల అసలు నిజమైన రూపం ఒక్కోసారి ప్రెవేట్ వీడియోలలో బయిటపడిపోతుంది. అలాంటిదే తాజాగా సల్మాన్ ఖాన్ కు జరిగింది.  అనుకోకుండా ఆయన బట్టతలతో కనిపించాడు సల్మాన్.

ఆదివారం రాత్రి ఒక రెస్టారెంట్‌కు వెళ్లాడు సల్మాన్. అక్కడ గుండు, క్లియర్ కనపడే బట్టతలతో కనిపించాడు. దీంతో ఆ  ఫొటోలు, వీడియోలు వెంటనే వైరల్ అయ్యాయి.ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సల్మాన్ బట్టతల వీడియో(Salman Bald Video) బాగా వైరల్ అవుతోంది. అయితే నిజంగానే సల్మాన్ ఇలా ఉన్నారా అనేది ప్రశ్నార్దకంగా మారింది. ఇది ఓ సినిమా కోసం చేసుకున్న లుక్ అని కొందరు  అభిమానులు అంటున్నారు. ఇక సల్మాన్ బట్టతల లుక్ లో తెరపై తేరే నామ్, సుల్తాన్ చిత్రాలలో  కనిపించాడు. దాంతో తేరే నామ్ 2 లేదా సుల్తాన్ 2 సినిమా తీస్తున్నారా అని సోషల్ మీడియాలో అడుగుతున్నారు.

ఇక ప్రస్తుతం సల్మాన్ .... టైగర్ 3 చిత్రంలో బిజీగా ఉన్నాడు.రీసెంట్ గా రిలీజైన  సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కీ జాన్'(kisika bhai kisiki jaan) పెద్ద దెబ్బ కొట్టింది. దాంతో ఇప్పుడు టైగర్ 3 పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.  సల్మాన్‌ఖాన్‌ (Salman Khan), కత్రినా కైఫ్‌ (Katrina Kaif) జంటగా నటిస్తోన్న చిత్రం ‘టైగర్‌ 3’ (Tiger 3). వీరిద్దరి కాంబోలో ఒకప్పుడు వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌ ఇది. మనీశ్‌ శర్మ దర్శకుడు.  ఈ చిత్రాన్ని ఈ  ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సల్మాన్‌ ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్‌ షేర్‌ చేశారు. హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ ఈ సినిమా విడుదల కానున్నట్లు వెల్లడించారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో రానున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది
చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?