
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా .. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. రామ్ చరణ్ నుంచి ఆర్‌సీ 15 గా ఈ ప్రాజెక్టుగా వస్తోంది. ఇక ఈసినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రామ్ చరణ్ తో రెండో సారి జతకట్టబోతోంది కియారా అద్వాని. దాదాపు మూడు నెలలు పైనే ఫ్యామిలీ కోసం బ్రేక్ తీసుకున్నాడు రామ్ చరణ్. ఈలోపు శంకర్ చెన్నై వెళ్ళి.. ఇండియాన్2 మూవీ షూటింగ్ ను ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసేశాడు.
ఇక రీసెంట్ గా ఈమూవీ షూటింగ్ రీ ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. ఇటీవలే బేగంపేటలోని షూటింగ్ స్పాట్‌లో శంకర్ బర్త్ డే గ్రాండ్ గా నిర్వహించారు టీమ్. దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈక్రమంలో రీసెంట్ గా స్టంట్ మాస్టర్ అన్బరివ్ నేతృత్వంలో మైక్రోబాట్ కెమెరాతో యాక్షన్ సీక్వెన్స్ షూట్‌ను పూర్తి చేశారు. 3 రోజుల బ్రేక్ తరువాత.. తాజాగా మరో షెడ్యూల్ ను ఈమూవీ స్టార్ట్ చేసుకుంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గేమ్ ఛేంజర్ షూటింగ్ మళ్లీ మొదలైంది. ఇక్కడ షూటింగ్ అయిపోగానే.. మరో లొకేషన్ ను కూడా రెడీగా ఉంచుకున్నారట టీమ్.
ఇక్కడ మేజర్ షూట్ కంప్లీట్ చేసి.. మరికొన్ని కీలక సన్నివేశాల ను షూట్ చేసేందుకు హైదరాబాద్ నుంచి మరో ప్రాంతానికి వెళ్లనుందట గేమ్ ఛేంజర్ టీమ్. ఈ షెడ్యూల్‌లో రాంచరణ్, సునీల్, ఇతక కీలక నటీనటులు పాల్గొననున్నారట. గేమ్ ఛేంజర్‌లో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నాడు.పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వీరితో పాటు ఎస్‌జే సూర్య, అంజలి, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఈమూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గేమ్ ఛేంజర్ ను భారీ బడ్జెట్ తో ..శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమా తరువాత చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానతో మూవీ చేయబోతున్నాడు.