మరో విషాదం.. పాతికేళ్ల యువ నటుడు పవన్ సింగ్ హఠాన్మరణం

Published : Aug 21, 2023, 09:26 AM IST
మరో విషాదం.. పాతికేళ్ల యువ నటుడు పవన్ సింగ్ హఠాన్మరణం

సారాంశం

మరో ఊహించని విషాదకర ఘటన చోటు చేసుకుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో బుల్లితెర నటుడిగా ఎదుగుతున్న యువ నటుడు పవన్ సింగ్ (25) మృతి చెందారు.

మరో ఊహించని విషాదకర ఘటన చోటు చేసుకుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో బుల్లితెర నటుడిగా ఎదుగుతున్న యువ నటుడు పవన్ సింగ్ (25) మృతి చెందారు. శనివారం రోజు తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పవన్ సింగ్ గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. 

దీనితో పవన్ సింగ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తీరని శోకంలో మునిగిపోయారు. పాతికేళ్ల యుక్త వయసులోనే పవన్ తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు. హిందీ, తమిళ భాషల్లో బుల్లితెరనటుడిగా పవన్ సింగ్ రాణిస్తున్నాడు. తన మాతృ భాష కన్నడలో కూడా ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటున్నాడు. 

ఈ తరుణంలో కుటుంబ సభ్యులు భరించలేని విషాదం జరిగింది. పవన్ సింగ్ కర్ణాటకలోని మాండ్య ప్రాంతం నుంచి వచ్చిన యువకుడు. సొంతంగా ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న పవన్ సింగ్ ఇలా మరణించడం జీర్ణించుకోలేని అంశం అని స్నేహితులు వాపోతున్నారు. 

పవన్ సింగ్ తల్లిదండ్రులు నాగరాజు, సరస్వతి. మాండ్య సొంతూరు కావడంతో ముంబై నుంచి భౌతిక కాయాన్ని తరలించి అక్కడే అంత్యక్రియల నిర్వహించారు. చిత్ర పరిశ్రమలో వరుసగా గుండెపోటు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలోనే పలువురు సెలెబ్రిటీలు మరణించారు. ఇటీవల కన్నడ హీరో విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన గుండెపోటు కారణంగా మరణించింది. అలాగే నటి శృతి షణ్ముగప్రియ భర్త అరవింద్ శేఖర్ గుండెపోటు కారణంగా పిన్న వయసులోనే మరణించారు.  

PREV
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?