బాలయ్య కోసం `యానిమల్‌` విలన్‌ని దించుతున్న బాబీ.. ఇద్దరు తలపడితే థియేటర్లకి పూనకాలే!

Published : Jan 27, 2024, 06:14 PM IST
బాలయ్య కోసం `యానిమల్‌` విలన్‌ని దించుతున్న బాబీ.. ఇద్దరు తలపడితే థియేటర్లకి పూనకాలే!

సారాంశం

 బాలకృష్ణ సరికొత్త పాత్రలో కనిపిస్తారని, ఆయన పాత్రలు రెండు షేడ్స్ లో ఉంటాయని తెలుస్తుంది. ఇదిలా ఉంటే బాలయ్య కోసం భారీ విలన్‌ని దించుతున్నాడు దర్శకుడు బాబీ. `యానిమల్‌` విలన్‌ని తీసుకొస్తున్నారు.

బాలకృష్ణ హ్యాట్రిక్‌ హిట్‌ అందుకున్నాడు. `అఖండ`, `వీర సింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి` చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. నిర్మాతలకు బయ్యర్లకి లాభాలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు `వాల్తేర్‌ వీరయ్య` వంటి బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన బాబీతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. సితార బ్యానర్‌లో ఈ మూవీ రూపొందుతుంది. ఫార్య్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శిఖర స్టూడియోస్‌ కలిసి నిర్మిస్తుంది. ఈ మూవీ  చిత్రీకరణ దశలో ఉంది. 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్లని విడుదల చేశారు. ఆయుధాలతో ఉన్న చిన్న బాక్స్‌, అలాగే ఓ గొడ్డలి పోస్టర్లు విడుదల చేయగా అవి ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచాయి. ఇదొక పీరియాడికల్ మూవీ అని తెలుస్తుంది. అందులో చూపించిన పనిముట్లు, ఆయుధాలు, రమ్‌ బాటిల్‌ ఆడియెన్స్ ని బ్యాక్‌ కి తీసుకెళ్తుందని అనిపిస్తుంది. భారీ స్కేల్‌లో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

ఇందులో బాలకృష్ణ సరికొత్త పాత్రలో కనిపిస్తారని, ఆయన పాత్రలు రెండు షేడ్స్ లో ఉంటాయని తెలుస్తుంది. ఇదిలా ఉంటే బాలయ్య కోసం భారీ విలన్‌ని దించుతున్నాడు దర్శకుడు బాబీ. `యానిమల్‌` విలన్‌ని తీసుకొస్తున్నారు. తాజాగా ఆ విషయాన్ని ప్రకటించారు. `యానిమల్‌`లో బాబీ డియోల్‌ విలన్‌గా నటించి ఆకట్టుకున్నారు. ఆయన కనిపించింది కొద్దిసేపే అయినా అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకున్నాడు, చివర్లో మ్యాజిక్‌ చేశాడు. సినిమా సక్సెస్‌లో కీలక భూమిక పోషించారు. ఈ మూవీని రణ్‌ బీర్‌ కపూర్‌ పాత్ర ఎంతగా హైలైట్‌ అయ్యిందో, బాబీ డీయోల్‌ పాత్ర సైతం అంతే బాగా పేలింది. సినిమా రేంజ్‌ని మార్చేసింది. 

`యానిమల్‌` విజయంతో అందరి చూపు బాబీ డియోల్‌పై పడింది. ఆయన కూడా సౌత్‌లో పాగా వేసేందుకు వస్తున్నారు. ఇప్పటికే సూర్య `కంగువా`లో ఆయన్ని తీసుకున్నారు. భయానక విలన్‌గా కనిపించబోతున్నారు. ఇప్పుడు మరో సినిమాని ప్రకటించారు. బాలయ్యతో కలిసి బాబీ డియోల్‌ని నటింప చేస్తున్నారు. ఇందులోనూ విలన్‌ పాత్రలో ఆయన కనిపిస్తారని తెలుస్తుంది. నేడు బాబీ డియోల్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు విషెస్‌ తెలియజేసింది యూనిట్‌. 

బాలకృష్ణ అంటే మాస్‌ కి కేరాఫ్‌. ఆయన యాక్షన్లోకి దిగితే ప్రత్యర్థులకు చుక్కలే. అంతటి పవర్‌ ఫుల్‌గా బాలయ్య యాక్షన్‌ ఉంటుంది. అలాంటిది మరో క్రూరమైన విలన్‌  పోటీ పడితే, ఇక థియేటర్లు రణరంగమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బాబీ డియోల్‌తో బాలయ్య తలపడితే దుమ్ములేచిపోతుందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీలో దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలో నటించబోతున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌ ఓ హీరోయిన్‌గా కనిపిస్తుందని తెలుస్తుంది. 

Read more: దుమ్ములేపుతున్న `సలార్‌`..ఇక్కడ నెంబర్‌ 1, అక్కడ నెంబర్‌ 3.. ప్రభాస్‌ రేంజ్‌ ఇలా ఉంటుంది..
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్