సలార్ మూవీ ప్రశాంత్ నీల్ కాకుండా ఎవరి తీసినా ఆడేది కాదు.. పరుచూరి కామెంట్స్

By tirumala AN  |  First Published Jan 27, 2024, 5:57 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్. పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రం 700 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి ప్రభాస్ అభిమానుల విజయ దాహం తీర్చింది. ఇక పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎదురుచూసేలా చేసింది.


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్. పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రం 700 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి ప్రభాస్ అభిమానుల విజయ దాహం తీర్చింది. ఇక పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎదురుచూసేలా చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని ప్రజెంట్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే తో చేసిన మ్యాజిక్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. 

సలార్ చిత్రం థియేటర్స్ లో సందడి చేయడం ముగిసింది. ఓటిటిలోకి కూడా వచ్చేసింది. దీనితో సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ సలార్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సలార్ చిత్రంలో యాక్షన్, జానపదం, పౌరాణికం, సాంఘికం ఇలా అన్ని అంశాల మేళవింపు ఉందని అన్నారు. పౌరాణిక గెటప్ లు మాత్రమే కనిపించలేదని కొన్ని సన్నివేశాల్లో ఆ తరహా ఛాయలు కనిపించినట్లు తెలిపారు. 

Latest Videos

అయితే సలార్ చిత్రం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తప్ప ఇంకెవరు తీసినా ఆడేది కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేరే దర్శకుడు ఈ కథతో సినిమా చేస్తే ఆడుతుందా అంటే అది మిలియన్ డాలర్ ప్రశ్న అని అన్నారు. తొలి 30 నిమిషాల వరకు ప్రభాస్ కి డైలాగ్ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది అని తెలిపారు. ఈ చిత్రంలో చూపించిన ఖాన్సార్ అనే ప్రాంతాన్ని చరిత్రతో మిళితం చేస్తూ నమ్మదగినట్లుగా చూపించారు అని అన్నారు. 

ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే తో ఒక ఆట ఆడుకున్నట్లు తెలిపారు. కళ్ళు చెదిరే విధంగా ఫైట్ సీన్స్ ఉన్నాయని అన్నారు. అలాగే సలార్ పార్ట్ 2 కోసం ఈ చిత్రంలో చాలా ప్రశ్నలు వదిలిపెట్టినట్లు తెలిపారు. చాలా విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. అవన్నీ పార్ట్ 2లో చూపిస్తారేమో అని పరుచూరి తెలిపారు. 

click me!