ముస్లిం అయిన నువ్వు హిందువుల దేవుడిని ఆరాధిస్తావా..? షారుఖ్ ఖాన్ పై నెటిజన్లు ఫైర్!

Published : Sep 17, 2018, 06:56 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
ముస్లిం అయిన నువ్వు హిందువుల దేవుడిని ఆరాధిస్తావా..? షారుఖ్ ఖాన్ పై నెటిజన్లు ఫైర్!

సారాంశం

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఆయన కొడుకు అబ్రామ్ గణేషుడిని పూజిస్తూ కనిపించడమే.. 

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఆయన కొడుకు అబ్రామ్ గణేషుడిని పూజిస్తూ కనిపించడమే.. అసలు విషయంలోకి వస్తే.. షారుఖ్ ఖాన్ తన చిన్న కొడుకు అబ్రామ్ ఇంట్లో గణేశుడి విగ్రహానికి పూజా చేస్తోన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మా గణపతి పప్పా ఇంటికి వచ్చేశాడు.. మా చిన్నోడు బఫ్ఫాను పప్పా అంటాడు అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీంటికి నెటిజన్ల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఓ ముస్లిం అయిన నువ్వు ఇంట్లో గణేషుడి విగ్రహాన్ని పెట్టిస్తావా..? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇస్లాంలో విగ్రహారాధన నిషేధమని, అలాంటప్పుడు నువ్వెలా పూజలు చేస్తావంటూ ప్రశ్నించారు.

ముస్లింలకు జన్మించిన నీవు గణేష్ చతుర్థి ఎలా జరుపుకుంటావని అతడిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం షారుఖ్ ని సపోర్ట్ చేస్తూ.. హిందూ, ముస్లిం కంటే ముందు మనం హిందుస్థానీ అన్న విషయం గుర్తించాలని కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే
2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్