ఫారెన్ గర్ల్ ఫ్రెండ్ తో విజయ్ దేవరకొండ రొమాన్స్!

Published : Sep 17, 2018, 06:41 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
ఫారెన్ గర్ల్ ఫ్రెండ్ తో విజయ్ దేవరకొండ రొమాన్స్!

సారాంశం

'పెళ్లిచూపులు','అర్జున్ రెడ్డి' చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో స్టార్ లీగ్ లోకి చేరిపోయాడు. అతడితో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. 

'పెళ్లిచూపులు','అర్జున్ రెడ్డి' చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో స్టార్ లీగ్ లోకి చేరిపోయాడు. అతడితో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం అతడు నటించిన 'నోటా' సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉండగా కొద్దిరోజులుగా విజయ్ ఓ ఫారెన్ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి.

ఈ ఫొటోల్లో విజయ్ ఏకంగా ఆ అమ్మాయిని ముద్దు పెడుతూ కనిపించడంతో టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ క్లోజ్ గా తీసుకున్న సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్లియర్ గా ఈ జంట సెల్ఫీలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే విజయ్ సన్నిహితులు మాత్రం ఇవి విజయ్ సినిమాలోకి రాకముందు ఫోటోలని, అప్పుడేవో ఫోటో షూట్స్ లో పాల్గొన్నాడని కవర్ చేసే ప్రయత్నం చేశారు. బిజీ బిజీగా గడుపుతోన్న విజయ్ కి ఈ వార్తలపై స్పందించే టైమ్ దొరుకుతుందేమో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే
2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్