బిగ్ బాస్ కారణంగా నాని క్రేజ్ తగ్గుతోందా..?

Published : Sep 17, 2018, 06:21 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
బిగ్ బాస్ కారణంగా నాని క్రేజ్ తగ్గుతోందా..?

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. మొదట్లో నాని హోస్టింగ్ ని ఎన్టీఆర్ తో పోలుస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. హోస్ట్ గా నాని అన్ ఫిట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి.

బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. మొదట్లో నాని హోస్టింగ్ ని ఎన్టీఆర్ తో పోలుస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. హోస్ట్ గా నాని అన్ ఫిట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. నిజానికి ఈ షోకి వ్యాఖ్యాతగా మారే వరకు కూడా నానిపై నెగెటివ్ కామెంట్స్ అనేవి వినిపించలేదు. నానిని ద్వేషించడానికి ఆడియన్స్ కి పెద్దగా కారణాలు కూడా దొరికేవి కాదు.

తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు అభిమాన హీరో అయిన నానికి ఇప్పుడు బిగ్ బాస్ షోతో నెగెటివిటీ అనేది ఎక్కువైంది. సినిమా పరంగా బిజీగా ఉండే నాని షో రెగ్యులర్ గా ఫాలో అయ్యేంత సమయం లేకపోవడంతో కొందరిని నియమించుకొని వారి సలహాలు, సూచనల ప్రకారం హోస్టింగ్ చేయడం మొదలుపెట్టాడు.

దీంతో గుడ్డిగా బిగ్ బాస్ నిర్వాహకులు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లాడు. ఇది తన క్రేజ్ పై ప్రభావం చూపుతుందని నాని ఊహించలేకపోయారు. ముఖ్యంగా కంటెస్టెంట్ కౌశల్ ని టార్గెట్ చేస్తూ నాని చేసిన కామెంట్స్ కారణంగా సోషల్ మీడియాలో ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ అతడి సినిమాలపై కూడా పడుతోంది. నాని సినిమా అంటే ముందుండే బయ్యర్లు 'దేవదాస్' సినిమా విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు.

దీంతో నిర్మాణ సంస్థ వైజయంతి స్వయంగా కొన్ని ఏరియాల్లో సినిమాను విడుదల చేస్తోంది. ఒక గేమ్ షోతో ఎందరో అభిమానులను నాని దూరం చేసుకున్నాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో కుప్పలుతెప్పలుగాకనిపిస్తున్నాయి. 'బిగ్ బాస్' షో హోస్ట్ చేయడానికి అంగీకరించి తనకున్న ఫ్యాన్ బేస్ ని కూడా తగ్గించుకున్నట్లైంది!

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?