`బిగ్‌బాస్‌` ఫేమ్‌ సయ్యద్‌ సోహైల్‌.. ఇప్పుడు `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌`

Published : Sep 05, 2021, 01:42 PM IST
`బిగ్‌బాస్‌` ఫేమ్‌ సయ్యద్‌ సోహైల్‌.. ఇప్పుడు `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌`

సారాంశం

బిగ్‌బాస్‌ పూర్తయిన వెంటనే ఆయనకు హీరోగా అవకాశాలు వచ్చాయి. అలా వచ్చిన వాటిలో అప్పిరెడ్డి చిత్రం ఒకటి. `జార్జిరెడ్డి` చిత్రాన్ని నిర్మించిన అప్పిరెడ్డి తన  మైక్‌ మూవీస్‌ బ్యానర్‌లో శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వంలో ఓ సినిమాని అనౌన్స్ చేశారు.   

`బిగ్‌బాస్‌4`తో పాపులర్‌ అయ్యారు సయ్యద్‌ సోహైల్‌. ఈ షో విన్నర్‌ అభిజిత్‌ అయినా, అంతకంటే ఎక్కువ పాపులారిటీ సోహైల్‌ దక్కించుకున్నాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ పాపులారిటీనే ఆయనకు వరుసగా సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది. బిగ్‌బాస్‌ పూర్తయిన వెంటనే ఆయనకు హీరోగా అవకాశాలు వచ్చాయి. అలా వచ్చిన వాటిలో అప్పిరెడ్డి చిత్రం ఒకటి. `జార్జిరెడ్డి` చిత్రాన్ని నిర్మించిన అప్పిరెడ్డి తన  మైక్‌ మూవీస్‌ బ్యానర్‌లో శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వంలో ఓ సినిమాని అనౌన్స్ చేశారు. 

ఈ సినిమా ప్రారంభమై చాలా రోజులవుతుంది. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ని ప్రకటించారు. `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఆదివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది యూనిట్‌. అన్నపరెడ్డి, అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టైటిల్ రోల్‌లో సోహైల్ సందడి చేయబోతున్నారు. కథా కథనాల పరంగా చూస్తే `మిస్టర్ ప్రెగ్నెంట్` సినిమా టాలీవుడ్ లో ఓ కొత్త వినోదాత్మక, ప్రేమకథా చిత్రంగానే కాకుండా చక్కని ప్రయోగాత్మక సినిమా అవుతుందని తెలుస్తోంది.

చిత్ర నిర్మాతలు చెబుతూ, `హీరో సోహైల్ `మిస్టర్ ప్రెగ్నెంట్` చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. అతని పాత్ర, కథాంశం విభిన్నంగా ఉంటాయి. పిల్లలకూ, పెద్దలకూ నచ్చేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి. ఈ చిత్రంలో సోహెల్ సరసన రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం` అని చెప్పారు. 

నటీనటులు :  సయ్యద్ సొహైల్ రియాన్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు. 

సాంకేతిక నిపుణులు : సినిమాటోగ్రఫీ - నిజార్ షఫీ, సంగీతం - శ్రావణ్ భరద్వాజ్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ - గాంధీ నడికుడికర్, బ్యానర్ - మైక్ మూవీస్, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాతలు - అప్పి రెడ్డి, రవిరెడ్డి సజ్జల, దర్శకత్వం - శ్రీనివాస్ వింజనంపాటి.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్