నటి హీనా ఖాన్‌కి కరోనా.. బ్యాక్‌ టూ బ్యాక్‌ చేదు వార్తలు

Published : Apr 27, 2021, 01:50 PM ISTUpdated : Apr 27, 2021, 01:54 PM IST
నటి హీనా ఖాన్‌కి కరోనా.. బ్యాక్‌ టూ బ్యాక్‌ చేదు వార్తలు

సారాంశం

 నటి హీనా ఖాన్‌కి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందట. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

నటి హీనా ఖాన్ కి కరోనా సోకింది. కోవిడ్‌ 19కి సినీ ప్రముఖులు కూడా భారీగా బలవుతున్నారు. ఆ వైరస్‌ బారిన పడుతున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, అమీర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ ఇలా చాలా మందికి కరోనా సోకింది. అందులో భాగంగా తాజాగా నటి హీనా ఖాన్‌కి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందట. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం తాను చాలా కష్ట కాలంలో ఉన్నానని, తనకోసం ప్రార్థించాలని కోరుకున్నారు. గత వారం క్రితమే గుండెపోటుతో హీనా ఖాన్‌ తండ్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

హీనా ఖాన్‌ చెబుతూ, `నాకు, నా కుటుంబ సభ్యులకు ఇది అత్యంత కష్టతరమైన సమయం. ఇలాంటి టైంలో నాకు కరోనా వచ్చిందని తేలింది. ఇంట్లోనే హాం క్వారంటైన్‌లో డాక్టర్ల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. ఇప్పుడు నాకు మీ అందరి ప్రార్థనలు ఎంతో అవసరం. అందరు జాగ్రత్తగా, సేఫ్‌గా ఉండండి` అని పేర్కొంది హీనా ఖాన్‌. తండ్రి మరణంతో కొన్ని రోజుల పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న హీనా ఖాన్‌..తాజాగా ఈ కష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. 

`యే రిష్‌తా క్యా కెహ్లాతా హై` అనే టీవీ సీరియల్‌గా నటిగా పరిచయమైంది హీనా ఖాన్‌. తొలి సీరియల్‌లోనే అద్భుతమైన నటనతో మెప్పించింది. టీవీ పరిశ్రమలో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. `బిగ్‌బాస్‌` షోతో మరింతగా పాపులర్‌ అయ్యింది హీనా.  `బిగ్‌బాస్‌11` సీజన్‌లో పాల్గొని రన్నరప్‌ నిలిచింది. హీనా ఖాన్‌ నటించిన తొలి చిత్రం `లైన్స్`కేన్స్‌ ఫెస్టివల్‌లో  ప్రదర్శించబడి ప్రశంసలందుకోవడం విశేషం. మరోవైపు హీనా ఖాన్‌ బికినీ అందాలతో, సెక్సీ పోజులతో నెటిజన్లని అలరిస్తున్న విషయంతెలిసిందే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ajith Shalini: మలేషియా రేస్‌కు ముందు షాలినిని ముద్దాడుతున్న అజిత్, అభిమానులు ఫిదా..వైరల్ అవుతున్న వీడియో
శ్రీదేవి కమెడియన్ తో రొమాన్స్ చేసిన సినిమా ఏదో తెలుసా? చిరు, రజనీ లాంటి స్టార్స్ తో మెరిసిన నటి ఎందుకిలా చేసింది?