కరోనా పేషెంట్లకి `ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియాభట్‌ సాయం..

By Aithagoni RajuFirst Published Apr 27, 2021, 12:04 PM IST
Highlights

తమ వంతు కరోనాని ఎదుర్కొనేందుకు, కరోనా రోగులను కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియాభట్‌ కోవిడ్‌ 19 పేషెంట్లకి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. 

కరోనా విలయతాండవం చేస్తుంది. దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రోజుకి వేల మంది ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతో చలించిపోయి కొందరు సెలబ్రిటీలు, ప్రముఖులు సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. తమ వంతు కరోనాని ఎదుర్కొనేందుకు, కరోనా రోగులను కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియాభట్‌ కోవిడ్‌ 19 పేషెంట్లకి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఇటీవల తాను కూడా కరోనాతో బాధపడిన విషయం తెలిసిందే. దాన్నుంచి కోలుకున్నాక ప్రియుడు, హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లొచ్చింది అలియా. దీంతో కరోనా బాధితులకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. 

 దేశంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించి అవసరమైన వారికి సహాయం చేస్తానని ప్రకటించింది. జర్నలిస్ట్‌ ఫయే డిసౌజాతో కలిసి కోవిడ్‌ పేషెంట్లు ఎంత మంది ఉన్నారు? ఎవరెవరికి తక్షణ సహాయం అందాల్సి ఉంది వంటి వివరాలను సేకరించి వారికి సహాయం చేస్తానని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆలియా ప్రకటించింది. చెప్పడమే కాదు సహాయక చర్యలు ప్రారంభించింది. తాజాగా ముంబయిలో హాస్పిటల్స్ బెడ్స్ కోసం, అంబులెన్స్ సర్వీస్‌, హెల్ప్ లైన్‌ నెంబర్ల వివరాలను ఇన్‌స్టాలో పంచుకుంది. దీంతోపాటు బెంగుళూర్‌, కోలకత్తాలకు హెల్ప్ లైన్‌ నెంబర్లని అభిమానులతో షేర్‌ చేసింది.

ఇదిలా ఉంటే కరోనా విజృంభన సమయంలో అలియా భట్‌, రణ్‌బీర్‌ పూర్‌, టైగర్‌ షరాఫ్‌, దిశాపటానీలు మాల్దీవులకు వెకేషన్‌కి వెల్లడం వివాదాస్పదంగా మారింది. ఓ వైపు జనాలు కరోనాతో బాధపడుతుంటే మీరు ఎంజాయ్‌ చేస్తారా? `కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా`అంటూ నెటిజన్లు ట్రోల్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక అలియా భట్‌ ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్ఆర్‌ఆర్‌`లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌ సరసన సీతగా నటిస్తుంది. హిందీలో `గంగూబాయ్‌ కథియవాడి`, `బ్రహ్మాస్త్ర` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

click me!