పుష్కర మలుపుతో వస్తున్న `కల్యాణ వైభోగం`

By Aithagoni RajuFirst Published Apr 27, 2021, 1:29 PM IST
Highlights

`కల్యాణ వైభోగం` ఇపుడు 12 ఏళ్ళ తర్వాత దివ్య, అభి జీవితం చుట్టూ తిరగనుంది. దివ్య పాత్రలో మరోసారి  ద్విపాత్రాభినయం చేయనుంది మేఘన లోకేష్. 

ప్రతి ముగింపు కూడా ఒక్క ఆరంభానికి నాంది పలుకుతుంది. కొత్త సవ్వడులు వెదజల్లుతుంది.  అలాగే కొత్త మలుపులు కూడా జీవితంలో ప్రవేశిస్తాయి. అలాంటి కొత్త మలుపులతోనే  మన ముందుకు వస్తుంది జీ తెలుగు వారి `కల్యాణ వైభోగం`. ఇప్పటివరకు  జై-మంగ గా ఎంతో అలరించిన ఆ రెండు పాత్రలు వారిని ఎంతోగానో అభిమానించే అభిమానులకు వీడుకోలు పలుకుతూ వారి పిల్లలైనా దివ్య , అభి లను స్వాగతిస్తున్నారు.

అందరకి ఎంతోగాను నచ్చిన `కల్యాణ వైభోగం` ఇపుడు 12 ఏళ్ళ తర్వాత దివ్య, అభి జీవితం చుట్టూ తిరగనుంది. దివ్య పాత్రలో మరోసారి  ద్విపాత్రాభినయం చేయనుంది మేఘన లోకేష్. దివ్య తన అన్నయ అయినా అభి కోసం 12 ఏళ్ళ నుంచి వెతుకుతుంది. ఇంత వరకు తన ఆచూకీ తెలీదు. కానీ, తన అన్నయ అంటూ ఇద్దరు వ్యక్తులు తన ముందుకు వస్తారు. మరి ఆ ఇద్దరిలో తన అన్న అభి ఎవరు? నిత్య ఏ విధంగా దివ్య జీవితంతో పాటు అభి జీవితంతో ఆడకుంటుందనేది తెలియాలంటే `కల్యాణ వైభోగం`లో జరిగే ఈ మార్పు ఈ బుధవారం నుండి చూడాల్సిందే. జీ తెలుగు, జీ తెలుగు హెచ్ డి లో రాత్రి 9: 30 గంటలకు ఇది ప్రసారం కానుంది. 

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండని చెబుతున్నరు జీ తెలుగు నిర్వహకులు. `జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే. మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి` అని తెలిపారు. సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. ఇప్పుడు జీ5లో కూడా లభ్యమవుతుందని చెప్పారు.
 

click me!