Bigg Boss5 నవరాత్రి స్పెషల్‌.. కూతురి ముద్దు ముద్దు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న లోబో..

Published : Oct 10, 2021, 07:07 PM ISTUpdated : Oct 10, 2021, 08:33 PM IST
Bigg Boss5 నవరాత్రి స్పెషల్‌.. కూతురి ముద్దు ముద్దు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న లోబో..

సారాంశం

మొదట గ్రౌండ్‌లో సైనికుల్లాగా పోటీ పడే గేమ్‌లో సన్నీ, విశ్వా ల మధ్య గేమ్‌ జరగ్గా, సన్నీ గెలుపొందారు. మరోవైపు సిరి, హమీద మధ్య జరిగిన గేమ్‌లో సిరి విజయం సాధించింది. సన్నీ.. లోబో ఫ్యామిలీ వీడియో చూపించేందుకు ఎంపిక చేసుకున్నారు. 

బిగ్‌ బాస్‌ 5 ఐదో వారం నవరాత్రి స్పెషల్‌ అదిరిపోయింది. ఆద్యంతం వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా సాగుతుంది. గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున లుక్‌ పండగ వాతావరణం తీసుకొచ్చింది. ఇంటి సభ్యులు కూడా గ్రాండ్‌గా ముస్తాబై కలర్‌ఫుల్‌గా కనిపించారు. ఇక నాగార్జున ఇంటి సభ్యులు గేమ్‌లు, గెలిచిన వారికి గిఫ్ట్ లు, అలాగే వారి ఫ్యామిలీ వీడియోలను ప్రదర్శించారు. 

అందులో భాగంగా మొదట గ్రౌండ్‌లో సైనికుల్లాగా పోటీ పడే గేమ్‌లో రవి టీమ్‌, ప్రియా టీమ్‌గా ఇంటి సభ్యులను విభజించారు బిగ్‌బాస్‌. రవి సైడ్‌ షణ్ముఖ్‌, లోబో, సిరి, ప్రియాంక, అనీ మస్టర్, సన్నీ ఉండగా, ప్రియా టీమ్‌ నుంచి విశ్వ, శ్రీరామ్‌, జెస్సీ, హమీద, మానస్‌ ఉన్నారు. సన్నీ, విశ్వా ల మధ్య గేమ్‌ జరగ్గా, సన్నీ గెలుపొందారు. మరోవైపు సిరి, హమీద మధ్య జరిగిన గేమ్‌లో సిరి విజయం సాధించింది. సన్నీ.. లోబో ఫ్యామిలీ వీడియో చూపించేందుకు ఎంపిక చేసుకున్నారు. ఇందులో లోబో కూతురు వీడియోలో మాట్లాడింది. ఆయనపై ప్రేమ, ఆయన్ని ఎంత మిస్‌ అవుతుందో తెలిపింది.

also read: MAA Election: ఓటింగ్‌కి దూరంగా ఉన్న ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, బన్నీ, సమంత, కాజల్‌, రకుల్‌.. విమర్శలు

అంతేకాదు బాగా ఎంటర్‌టైన్‌ చేస్తున్నావని, ఇంకా బాగా ఆడాలని, విజయం సాధించాలని కోరింది. దీంతో కూతురుని చూసుకుని, కూతురు ముద్దు ముద్దు మాటలకు ముగ్దుడైన లోబో కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని ఆకట్టుకుంది. మరోవైపు సిరీ.. జెస్సీ ఫ్యామిలీ వీడియోస్‌ చూపించాలని చెప్పడంతో జెస్సీ అమ్మ వీడియోలో మాట్లాడింది. బాగా ఆడుతున్నావని, వారి ఫ్రెండ్స్ బాగున్నారని, దెబ్బలు తగిలినా చాలా బాగా గేమ్‌లో పార్టిసిపేట్‌ చేస్తున్నావని ప్రశంసించింది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియలో మానస్‌, జెస్సీ సేవ్‌ అయ్యారు. ఇంకా ఏడుగురు నామినేషన్లలో ఉన్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Divvala Madhuri: బిగ్‌బాస్‌లో రీతూ రోత పనులు చూడలేకపోయాను, అందుకే ప్రశ్నించాల్సి వచ్చింది
Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?