Maa Elections: బయటికి పో.... ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యుడు రమణారెడ్డికి మోహన్ బాబు వార్నింగ్

By Siva KodatiFirst Published Oct 10, 2021, 6:48 PM IST
Highlights

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘‘మా’’ ఎన్నికల్లో (maa elections) చివరి రోజు కూడా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కౌంటింగ్ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుడు రమణారెడ్డికి (ramana reddy) మోహన్ బాబు (mohan babu) వార్నింగ్ ఇచ్చారు. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘‘మా’’ ఎన్నికల్లో (maa elections) చివరి రోజు కూడా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కౌంటింగ్ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుడు రమణారెడ్డికి (ramana reddy) మోహన్ బాబు (mohan babu) వార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ స్థలం నుంచి బయటకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో జోక్యం చేసుకున్న ఎన్నికల అధికారులు రమణారెడ్డిని బయటకు పంపారు. అయితే మంచు విష్ణు తండ్రి మోహన్ బాబుకి సర్దిచెప్పారు. 

అంతకుముందు తొలుత పోస్టల్ బ్యాలెట్ (postal ballot) ఓట్లను ఎన్నికల అధికారులు లెక్కించారు. వీటిలో మంచు విష్ణు ప్యానెల్ ముందంజలో వున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా ఈసీ మెంబర్ల ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం ఆరు టేబుల్స్‌పై ఓట్లను లెక్కిస్తున్నారు. ఈసీ మెంబర్లలో 50 చెల్లని ఓట్లు వున్నాయని అధికారులు ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. 665 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి వీటి సంఖ్య 700 దాటే అవకాశం వుందని సమాచారం. గతంలోనే ఎన్నడూ లేని విధంగా 83 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 

Also Read:Maa Elections: పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో మంచు విష్ణు ప్యానెల్ ముందంజ.. 50 చెల్లని ఓట్లు

అంతకుముందు  ఊహించిన దాని కంటే ఎక్కువగా సభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటెత్తడంతో ముందుగా ఇచ్చిన పోలింగ్ గడువు సరిపోదని మా ఎన్నికల అధికారులు నిర్థారించారు. దీంతో మా అధ్యక్ష అభ్యర్ధులు ప్రకాశ్ రాజ్ (prakash raj), మంచు విష్ణులతో (manchu vishnu) చర్చించిన ఎన్నికల అధికారులు పోలింగ్ సమయం మరో గంట పెంచాలని నిర్ణయించారు. దీంతో మా ఎన్నికల పోలింగ్ 3 గంటల వరకు జరిగింది. క్యూలైన్‌లో వున్నవారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. పోటీలో నిలిచిన ఇరు ప్యానెల్స్ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమ ప్యానెల్ విజయం సాధిస్తుంది అంటూ.. ధీమాగా చెబుతున్నారు. ఇంత హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో విజేత ఎవరనేది మరి కొన్ని గంటలలో తేలిపోనుంది. 

click me!