రజనీ కుమార్తె ఐశ్వర్య దర్శకురాలిగా తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా

Published : Oct 02, 2021, 07:55 PM IST
రజనీ కుమార్తె ఐశ్వర్య దర్శకురాలిగా తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా

సారాంశం

ధనుష్‌ భార్య, దర్శకురాలు ఐశ్వర్యా ఆర్‌ ధనుష్‌ తెలుగులో సినిమా చేయబోతుంది. దర్శకురాలిగా లైకా ప్రొడక్షన్‌తో కలిసి ఓ స్ట్రెయిట్‌ సినిమా చేయబోతున్నట్టు వెల్లడించారు. ఐశ్వర్య.. రజనీకాంత్‌ కూతురనే విషయం తెలిసిందే.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(rajinikanth) తనయ, ధనుష్‌(dhanush) భార్య ఐశ్వర్య ఆర్‌ ధనుష్‌(aishwaryaa r dhanush) దర్శకురాలిగా మరో ప్రయత్నం చేస్తుంది. ఈ సారి తెలుగులో డైరెక్ట్ సినిమా చేసేందుకు రెడీ అవుతుంది. అందుకు `2.0` వంటి భారీ బడ్జెట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ నిర్మించేందుకు ముందుకు రావడం విశేషం. సుభాస్కరన్‌, మహవీర్‌ జైన్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఐశ్వర్య గతంలో ధనుష్‌ హీరోగా `3` సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయ్యింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఈ సినిమాలోని `కొలవెరి` సాంగ్‌ మాత్రం ఇండియా వైడ్ గా దుమ్మురేపింది. ఆ తర్వాత `వెయ్‌ రాజా వెయ్‌` చిత్రంతో దర్శకురాలిగా నిరూపించుకుంది ఐశ్వర్య. పాన్‌ ఇండియన్‌ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్య ఆర్‌. ధనుష్‌ మాట్లాడుతూ `లైకా ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాను. పాన్‌ ఇండియన్‌ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది` అని చెప్పారు.

లైకా ప్రొడక్షన్స్‌ సీఈవో ఆశిష్‌ సింగ్‌ మాట్లాడుతూ `మా సంస్థలో తొలి స్ట్రయిట్‌ తెలుగు సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుండటం మాకెంతో ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం మాకుంది` అని చెప్పారు.  సినిమాలో నటీనటులు, పని చేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. లైకా ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న `రామ్‌ సేతు`తో హిందీ పరిశ్రమలోకి ప్రవేశిస్తోంది. జాన్వీ కపూర్‌ కథానాయికగా `గుడ్‌ లక్‌ జెర్రీ` నిర్మిస్తోంది. హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాలు నిర్మిస్తోంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sobhita Dhulipala: తండ్రి కాబోతున్న నాగ చైతన్య, శోభిత.. సమంతకు అదిరిపోయే షాక్!
Demon Pavan: రీతూ చౌదరికి రూ.5 లక్షల గిఫ్ట్ ? నాగార్జునకి మైండ్ బ్లాక్.. అందరి ముందు రివీల్ చేశాడుగా..