త్వరలో బిగ్ బాస్ 3.. సెలబ్రిటీలు వీరేనా..?

Published : Jan 07, 2019, 03:41 PM ISTUpdated : Jan 07, 2019, 03:45 PM IST
త్వరలో బిగ్ బాస్ 3.. సెలబ్రిటీలు వీరేనా..?

సారాంశం

ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు షో రెండు సీజన్లను పూర్తి చేసుకొని మరికొద్ది నెలల్లో బిగ్ బాస్ 3ని మొదలుపెట్టనున్నారు. ఇప్పటినుండే షోకి సంబంధించిన పనులను నిర్వహిస్తున్నారు. 

ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు షో రెండు సీజన్లను పూర్తి చేసుకొని మరికొద్ది నెలల్లో బిగ్ బాస్ 3ని మొదలుపెట్టనున్నారు. ఇప్పటినుండే షోకి సంబంధించిన పనులను నిర్వహిస్తున్నారు. హోస్ట్ గా ఎవరిని తీసుకుంటారనే విషయంలో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. వెంకటేష్ ఈ షోని నిర్వహిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా.. ఈ షోలో కంటెస్టంట్స్ గా ఎవరిని తీసుకోబోతున్నారనే విషయంలో కొన్ని పేర్లు లీక్ అయ్యాయి. రెండో సీజన్ లానే మూడో సీజన్ కూడా సెలబ్రిటీలు,  సామాన్యుల కలయికతో ఉంటుందని తెలుస్తోంది. రెండో సీజన్ లో సెలబ్రిటీలు పెద్దగా లేరనే విమర్శలు వినిపించాయి.

దీంతో ఈసారి ఆ విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.  కంటెస్టంట్స్ గా కాస్త పేరున్న వారిని రంగంలోకి దింపబోతున్నారట. అందులో రేణుదేశాయ్, గద్దె సింధూర, శోభిత దూలిపాళ్ళ, వరుణ్ సందేశ్, యాంకర్ ఉదయభాను, రఘు మాస్టర్, హేమచంద్ర, టీవీ ఆర్టిస్ట్ జాకీ, జబర్దస్త్ పొట్టి నరేష్, కమల్ కామరాజు, మనోజ్ నందన్, యూట్యూబ్ స్టార్ జాహ్నవి(మహాతల్లి), నాగ పద్మిని ఈ షోలో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.

సీజన్ 2 షూటింగ్ హైదరాబాద్ లో జరగడంతో ముందే షోకి సంబంధించిన విషయాలు బయటకి వచ్చేసేవి. ఈసారి మాత్రం హైదరాబాద్ లో బిగ్ బాస్ సెట్ వేయడం లేదని తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌
9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?