ఆ పని చేస్తే చెప్పేస్తా.. నాకు పెళ్లితో పని లేదు: బిగ్ బాస్ బ్యూటీ!

Published : Jan 07, 2019, 02:37 PM ISTUpdated : Jan 07, 2019, 02:42 PM IST
ఆ పని చేస్తే చెప్పేస్తా.. నాకు పెళ్లితో పని లేదు: బిగ్ బాస్ బ్యూటీ!

సారాంశం

తమిళ బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన నటి ఓవియా.. తెలుగులోకూడా తరుణ్ తో కలిసి ఓ సినిమాలో నటించింది. గత కొంతకాలంగా ఆమె పెర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. 

తమిళ బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన నటి ఓవియా.. తెలుగులోకూడా తరుణ్ తో కలిసి ఓ సినిమాలో నటించింది. గత కొంతకాలంగా ఆమె పెర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. నటుడు ఆరవ్ తో ఆమె ప్రేమలో ఉందని, ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని అంటున్నారు.

ఇటీవల ఇద్దరూ గొడవ పని విడిపోయారని కూడా రూమర్లు వినిపించాయి. దీనిపై స్పందించిన ఓవియా.. ఆరవ్ తనకు మంచి స్నేహితుడని, అతడంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇద్దరం గొడవ పడిన మాట నిజమేనని కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చింది.

బయట ఈవెంట్స్ కి కలిసే వెళ్తామని తెలిపింది. ఆరవ్ తో స్నేహంగా ఉండడం చూసి కొందరు ప్రేమలో ఉన్నట్లు అనుకున్నారని, మరికొందరు పెళ్లి కూడా జరగబోతుందని వార్తలు సృష్టించారని వెల్లడించింది.

ఒకవేళ నిజంగానే ఆరవ్ తో డేటింగ్ చేస్తే ఆ విషయాన్ని బయటకి చెప్పడానికి తనకు ఎలాంటి మొహమాటం లేదని స్పష్టం చేసింది ఓవియా. ఆరవ్ తనకు ఎంతో సపోర్ట్ చేస్తాడని చెప్పిన ఈ బ్యూటీ తనకు పెళ్లి వ్యవస్థపై నమ్మకం లేదని, తనకు పెళ్లి కూడా అవసరం లేదని తేల్చేసింది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌