బిగ్ బాస్2: తోటి హౌస్ మేట్ ని తక్కువ చేస్తావా..? కౌశల్ కి నాని పంచ్..!

Published : Sep 15, 2018, 05:27 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
బిగ్ బాస్2: తోటి హౌస్ మేట్ ని తక్కువ చేస్తావా..? కౌశల్ కి నాని పంచ్..!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 లో శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో నాని హౌస్ మేట్స్ అందరితో చాలా సీరియస్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది. 

బిగ్ బాస్ సీజన్ 2 లో శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో నాని హౌస్ మేట్స్ అందరితో చాలా సీరియస్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది. గత వారంలో శ్యామల విసిరిన బిగ్ బాంబ్ కారణంగా రోల్ రైడా హౌస్ మేట్స్ అందరూ ఏం పనులు చెప్తే అది చేయాలి.

ఈ క్రమంలో కౌశల్.. రోల్ రైడాతో ఏం చెప్పినా చేస్తావా.. అంటూ అసభ్యకరంగా ఓ మాట అన్నారు. ఆ క్షణంలో రోల్ దానికి స్పందించకుండా తోటి హౌస్ మేట్స్ కి చెప్పుకొని బాధ పడ్డాడు. ఈరోజు ఇదే విషయంపై నాని చర్చకు దిగారు.

ముందుగా రోల్ తో మాట్లాడుతూ ''ఇక్కడ మంచి అనిపించుకోవడం ముఖ్యం కాదు.. మంచి కోసం నిలబడడం కూడా ముఖ్యమే.. మీకు ఒకటి కరెక్ట్ అనిపించింది.. ఒకటి తప్పు అనిపించినప్పుడు అప్పటికప్పుడు అడిగే దమ్ముండాలి'' అనగానే రోల్.. కౌశల్ తనతో ప్రవర్తించిన తీరుని నానికి వివరించాడు. 'కౌశల్ అన్నవా అని' నాని అతడిని ప్రశ్నించగా కౌశల్ అవునని ఒప్పుకున్నాడు.

తోటి హౌస్ మేట్ ని తక్కువ చేసి మాట్లాడడం పట్ల నాని.. కౌశల్ పై అసహనం వ్యక్తం చేశారు. పిల్లలు వచ్చిన ట్రాన్స్ లో ఉన్నానని కవర్ చేసే ప్రయత్నం చేయగా.. పిల్లలు ఆ తరువాత వచ్చారు అంటూ నాని అనడంతో కౌశల్ బ్లాంక్ అయిపోవడం ప్రోమోలో చూపించారు. మరి కౌశల్ తనని తాను ఎలా సమర్ధించుకుంటాడో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Arya Underwater Stunt: హాలీవుడ్ రేంజ్ రిస్క్.. గడ్డకట్టే నీళ్ళల్లో 90 నిమిషాలు ఫైట్, సినిమా కోసం హీరో సాహసం
Allu Arjun పాట క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టడం ఏ స్టార్ హీరో వల్ల కాదేమో