బిగ్ బాస్2: గీతామాధురికి నాని క్లాస్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

Published : Sep 15, 2018, 04:26 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
బిగ్ బాస్2: గీతామాధురికి నాని క్లాస్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటివరకు 95 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. మరికొద్దిరోజుల్లో ఈ షో పూర్తికానుంది. ఈ వారం నామినేషన్స్ లో అమిత్, రోల్, కౌశల్, దీప్తి, గీతామాధురిలు ఉండగా.. తక్కువ ఓట్లు అమిత్, రోల్ రైడాలను వచ్చాయి. 

దీంతో వీరిద్దరిలో ఒకరు బయటకి వెళ్లే ఛాన్స్ ఉందనుకుంటే ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ తన ప్లాన్ ప్రకారం దీప్తిని బయటకి పంపబోతున్నారని టాక్. నిజానికి ఈ వారం నామినేషన్స్ లో దీప్తికి ఓట్లు బాగానే వచ్చాయి. ఈ క్రమంలో ఆమెని బయటకి పంపితే మరోసారి ప్రజల ఓట్లకు విలువ లేదనే విమర్శలను ఈ షో ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.

మరి బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడో చూడాలి. ఇక ఈరోజు ఎపిసోడ్ లో హోస్ట్ నాని.. కంటెస్టెంట్ గీతాకి క్లాస్ పీకినట్లు సమాచారం. కౌశల్ పట్ల ఆమె వ్యవహరించిన తీరు పట్ల నానిని ఆమెని ప్రశ్నించి తప్పులు ఎత్తి చూపడంతో గీతా ఎమోషనల్ అయినట్లు చెబుతున్నారు. కౌశల్ ని కూడా టాస్క్ లలో సంచలకుడిగా సొంత రూల్స్ పెట్టుకోవడమేంటని ప్రశ్నించబోతున్నారట. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi లో రామ్ చరణ్ ఇన్‌స్పిరేషన్ గా తీసుకున్న విషయం ఏంటో తెలుసా? మెగాపవర్ స్టార్ ఎమోషనల్ కామెంట్స్..
Thimmarajupalli TV Review: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?