టఫ్ గా కనిపిస్తారు కానీ మాట వింటారు.. తారక్ తో పూజా!

Published : Sep 15, 2018, 05:00 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
టఫ్ గా కనిపిస్తారు కానీ మాట వింటారు.. తారక్ తో పూజా!

సారాంశం

'అనగనగనగా అరవిందట తన పేరు అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరు..' అంటూ 'అరవింద సమేత' సినిమాలో సాగే పాటను ఈరోజు విడుదల చేసింది చిత్రబృందం. 

'అనగనగనగా అరవిందట తన పేరు.. అందానికి సొంతూరు.. అందుకనే ఆ పొగరు..' అంటూ 'అరవింద సమేత' సినిమాలో సాగే పాటను ఈరోజు విడుదల చేసింది చిత్రబృందం. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఎన్టీఆర్ - పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 20న సినిమా ఆడియో ఫంక్షన్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే ముందుగానే మార్కెట్ లోకి పాటలను విడుదల చేసి సింపుల్ గా స్టేజ్ మీద ఫంక్షన్ చేయాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా సినిమాకు సంబంధించి 'అనగనగనగా' అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాట మొదలవ్వడానికి ముందు పూజా హెగ్డే.. ''టఫ్ గా కనిపిస్తారు కానీ మాట వింటారు'' అంటూ ఎన్టీఆర్ తో చెబుతుండగా దానికి ఎన్టీఆర్ సిగ్గుపడుతూ కనిపించిన సన్నివేశం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం, అర్మాన్ మాలిక్ గానం, థమన్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. అరవింద సమేత ఆల్బమ్ లో ఈ పాట హిట్ కావడం ఖాయమనిపిస్తుంది. దసరా కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్