'గీత గోవిందం' దర్శకుడు నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడా..?

Published : Sep 08, 2018, 06:28 PM ISTUpdated : Sep 09, 2018, 01:32 PM IST
'గీత గోవిందం' దర్శకుడు నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడా..?

సారాంశం

'సోలో', 'శ్రీరస్తు శుభమస్తు' వంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్న దర్శకుడు పరశురామ్ రీసెంట్ గా 'గీత గోవిందం' చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో పరశురామ్ కి ఎనలేని క్రేజ్ వచ్చింది.

'సోలో', 'శ్రీరస్తు శుభమస్తు' వంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్న దర్శకుడు పరశురామ్ రీసెంట్ గా 'గీత గోవిందం' చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో పరశురామ్ కి ఎనలేని క్రేజ్ వచ్చింది. అయితే అతడిపై ఇప్పుడు ఇండస్ట్రీలో నెగెటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి. గీత గోవిందం సినిమాకు ముందు కొందరు నిర్మాతల వద్ద సినిమాలు చేస్తానని అడ్వాన్స్ లు తీసుకున్న పరశురామ్ ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని సమాచారం.

ఇప్పటికే మంచు ఫ్యామిలీతో ఓ సినిమా చేయాలి కానీ తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలానే మైత్రి మూవీ మేకర్స్ దగ్గర నుండి కూడా పరశురామ్ అడ్వాన్స్ తీసుకున్నాడట. నిర్మాతలు అతడితో సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించిన ప్రతిసారి నెక్స్ట్ సినిమా మీకే అంటూ కబుర్లు చెబుతున్నాడట. గీతాఆర్ట్స్ లో కూడా ఓ సినిమా చేయాల్సివుంది.

ఇలా అడ్వాన్స్ లు తీసుకున్న పరశురామ్ ఇప్పుడు మాత్రం ఎవరితో సినిమా చేయాలనే విషయంలో ఓ నిర్ణయానికి రాక నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారని టాక్. 'గీత గోవిందం' సినిమా లాభాల్లో పరశురామ్ కి కూడా వాటా రానుంది. ఆ డబ్బుతో నిర్మాతల వద్ద తీసుకున్న అడ్వాన్స్ ని వారికి తిరిగి ఇచ్చేసి ప్రస్తుతానికి ఈ ఇష్యూ నుండి బయట పడాలని చూస్తున్నాడట! 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?