బిగ్ బాస్2: కొడుకుని చూసి ఎమోషనల్ అయిన అమిత్

Published : Sep 11, 2018, 06:11 PM ISTUpdated : Sep 19, 2018, 09:23 AM IST
బిగ్ బాస్2: కొడుకుని చూసి ఎమోషనల్ అయిన అమిత్

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 సోమవారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ చేపట్టగా కౌశల్, దీప్తి, గీతామాధురి, రోల్ రైడా, అమిత్ లు నామినేషన్స్ లో ఉన్నారు. 

బిగ్ బాస్ సీజన్ 2 సోమవారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ చేపట్టగా కౌశల్, దీప్తి, గీతామాధురి, రోల్ రైడా, అమిత్ లు నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ ని కంట్రోల్ చేసే రిమోట్ తన చేతుల్లోకి తీసుకొని 'ఫ్రీజ్..' అంటూ వారితో ఓ గేమ్ ఆడుకున్నాడు బిగ్ బాస్.

అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి చెందిన కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరిని హౌస్ లోకి పంపబోతున్నారు. ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ కోసం తన తల్లి వచ్చింది. ఫ్రీజ్ అయి ఉన్న తన కొడుకుని వెనుక నుండి కౌగిలించుకొని సంతోష పడింది.

ఇక అమిత్ కోసం తన కొడుకు వస్తూ.. 'హాయ్ పాపా ఐ మిస్ యూ సో మచ్' అని చెప్పడం ఎమోషనల్ గా సాగింది. తన కొడుకుని హత్తుకొని ఏడుస్తున్న అమిత్ ని చూస్తుంటే తనకు పిల్లలతో ఉన్న బాండింగ్ తెలుస్తుంది. ఈరోజు టాస్క్ మరింత ఎమోషనల్ గా సాగుతుందని తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?