హీరో షాకింగ్ డెసిషన్.. కారణం ఆమేనా..?

Published : Sep 11, 2018, 05:24 PM ISTUpdated : Sep 19, 2018, 09:23 AM IST
హీరో షాకింగ్ డెసిషన్.. కారణం ఆమేనా..?

సారాంశం

'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్నా.. 'గీత గోవిందం' చిత్రంతో తెలుగులో టాప్ లీగ్ లోకి వెళ్లిపోయింది. నిర్మాతలు ఆమె అడిగినంత మొత్తాన్ని రెమ్యునరేషన్ గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్నా.. 'గీత గోవిందం' చిత్రంతో తెలుగులో టాప్ లీగ్ లోకి వెళ్లిపోయింది. నిర్మాతలు ఆమె అడిగినంత మొత్తాన్ని రెమ్యునరేషన్ గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగులో అంతగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఇదివరకే నటుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ అయింది. అయితే తన కెరీర్ దృష్ట్యా ఇప్పుడు ఆ నిశ్చితార్దాన్ని రద్దు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో ఈ విషయంపై రక్షిత్ శెట్టికి సోషల్ మీడియాలో ప్రశ్నలు ఎక్కువవుతుండంతో తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది. తన అభిమానులు సోషల్ మీడియాలో తరచూ పెళ్లి గురించి అడుగుతుండడంతో రక్షిత్ వారికి సమాధానాలు చెప్పలేక సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నాడు. అదే విషయాన్ని అభిమానులకు చెబుతూ.. ఇన్నాళ్లు ఆదరించిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియాకి గుడ్ బై చెబుతూ పోస్ట్ పెట్టాడు.

దీంతో రష్మికతో బ్రేకప్ అయిన కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఉంటే పదే పదే అవే ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు