నిశ్చితార్ధం రద్దయింది.. హీరోయిన్ తల్లి కన్ఫర్మేషన్!

By Udayavani DhuliFirst Published 11, Sep 2018, 5:51 PM IST
Highlights

గతేడాది హీరోయిన్ రష్మిక మందన్నా.. తన కో స్టార్ రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. మరికొద్దిరోజుల్లో వీరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే ఇంతలోనే వీరి ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిందనే వార్తలు ఊపందుకున్నాయి

గతేడాది హీరోయిన్ రష్మిక మందన్నా.. తన కో స్టార్ రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. మరికొద్దిరోజుల్లో వీరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే ఇంతలోనే వీరి ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిందనే వార్తలు ఊపందుకున్నాయి. వీటిపై స్పందించిన రష్మిక అలాంటిదేమీ లేదని కవర్ చేసే ప్రయత్నం చేసింది.

అయితే తాజాగా రష్మిక తల్లి సుమన్ మందన్నా తన కూతురు నిశ్చితార్ధం రద్దయిన మాట నిజమేనని క్లారిటీ ఇచ్చింది. కన్నడలో ప్రముఖ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన ఆమె ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ''రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. రష్మిక, రక్షిత్ ల మధ్య అభిప్రాయబేధాలు రావడంతో ఇద్దరికీ పొసగడం లేదు. వారి మధ్య విబేధాలను తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ వీలు కాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నిశ్చితార్ధం రద్దు చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది'' అంటూ ఆమె స్పష్టం చేశారు.

రష్మిక, రక్షిత్ ల నిశ్చితార్ధం రద్దు కావడం ఇరు కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితి నుండి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు రష్మిక తల్లి చెప్పుకొచ్చారు. ఒకరి కారణంగా మరొకరి జీవితంలో ఇబ్బంది రాకూడదనే ఆలోచనతో ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసినట్లు తెలిపారు. 

Last Updated 19, Sep 2018, 9:23 AM IST